నాలో ఆందోళన మొదలైంది..
వరుసగా ఆడపిల్లపై జరుగుతున్నా దారుణాలను చూస్తుంటే నాలో ఆందోళన మొదలైంది..
ఎవర్ని నమ్మి పంపాలి నా చెల్లిని బడికి,కళాశాలకు..
ఎవరిని నమ్మి పంపాలి నా అక్కను,భార్యను ఉద్యోగానికి..
నా దేశంలో నా అక్క,చెల్లి,భార్యాకు ఎందుకు లేదు రక్షణ..??
ఒక్కొక్క సంఘటన చూస్తుంటే నాలో ఆగ్రహం రగులుతుంది..
కానీ ఎం లాభం ఆగ్రహానికి గురైతే చివరికి కేసులతో ఇబ్బంది పాడేది నేనే..
అలాని మౌనంగా ఉండిపోవాలా..??
ఎవర్ని ప్రశ్నించాలి,ఎవరి గల్లా పట్టి అడగాలి నా ఇంటి ఆడపిల్లను రక్షించు అని
నాయకులర్రా మీ ఉచిత పథకాలు నాకొద్దు..పొడి కారం తినైనా బ్రతుకుత
కానీ నా దేశంలో ఉన్న ఆడపిల్లను రక్షించు..
లేదంటే నా ఆగ్రహం ఉగ్రరూపం దాల్చుతుంది..
- నదీమ్ అబ్దుల్