- పట్టణంలో సెల్లార్ లతో అక్రమ నిర్మాణాలు..
- అక్రమ నిర్మాణాలు అయిన, కూల్చివేతలు లేవే..?
- ఎక్కడ చూసినా అక్రమ షెడ్ల నిర్మాణాలే..
- నోటీసులు కాసుల కోసమేనా..?
- పత్తలేని జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్.
సూర్యపేటలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అభివృద్ధిలో జిల్లా శరవేగంగా ముందుకు వెళ్తుంటే, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెద్ద రోడ్లు కాస్త చిన్న రోడ్లుగా మారుతున్నాయి. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ నుండి అనుమతి తీసుకోవడం, అధికారుల చేతులు తడిపి నామ్స్ కు విరుద్ధంగా రోడ్లు, కాలువలు ఆక్రమించి భవనాలు ఇల్లు నిర్మాణాలు చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులకు ఈ విషయం తెలియదా అంటే, ప్రతిరోజు టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టణంలోని గల్లీ గల్లీలో తిరుగుతానే ఉంటారు. నిర్మాణం అవుతున్న భవనాలు, ఇళ్లను ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అయినా ఎలాంటి సెట్ బ్యాగ్ లేకుండా అనుమతుకు మించి నిర్మాణం అవుతున్న అక్రమ కట్టడాల విషయంలో వారు నోరు మెదకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
అక్రమ కట్టడాలలో కొన్ని..
ఎం జి రోడ్డు లోని మధు గార్మెంట్స్ పక్కనే ఓ బిల్డింగ్ (సుమారు 10 నెలలు) కన్స్ట్రక్షన్ జరగగా, ప్రతిరోజు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికా రులు ఆ షాపు ముందు నుండే రాకపోకలు సాగిస్తున్న, నిర్మాణదారుడుకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకపోవడంతో సెట్ బ్యాక్ లేకుండానే నిర్మాణం చేశారు.సాయి దీప్తి హాస్పిటల్ పక్కనే మరో భవనం అక్రమంగా సెల్లార్ నిర్మాణం జరిపి, అదనంగా ఒక ఫ్లోర్ అక్రమంగా నిర్మించినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసు కోకపోవడం గమనార్హం. అమ్మ హాస్పిటల్ పక్కన మరొక బిల్డింగ్, వినూత్న హాస్పిటల్ పక్క గల్లీలో మరొక బిల్డింగ్ ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని భవనాలు అను మతి తీసుకొని, అనుమతికి మించి అక్రమ నిర్మా ణాలు జరుగుతున్నా కూడా సంబంధిత శాఖ అధికా రులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్ర మ నిర్మాణాలు కొన్ని అయితే, ఎలాంటి అనుమతులు లేకుండానే జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట భారీ ఎత్తున షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. 60 ఫీట్ రోడ్ లో, నిర్మల హాస్పిటల్ రోడ్, ఖమ్మం క్రాస్ రోడ్, కుడ కుడ రోడ్డు, కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్ లో షెడ్లు నిర్మాణం అవ్వగా, ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఎలాంటి పర్మిషన్ లేకుండానే క్రికెట్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో అక్రమంగా ఇన్ని నిర్మాణాలు జరుగుతున్నా కూడా, సంబంధిత శాఖ అధికారులకు, జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నిర్మాణాల విషయమై మున్సిపల్ కమిషనర్ ను చరవాణి ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
గతంలో అనుమతి లేని కట్టడం కూల్చివేత.
సూర్యాపేట పట్టణంలోని 16వార్డు, బేచ్ రాగ్ మాదారం, సర్వే నెం.58/ఇ. 58/ఉ నందు పడిదల శ్రవణ్ కుమార్ అను అతను మున్సిపల్ టియస్.బిపాస్ 2020 నిబంధనలకు విరుద్దముగా అనుమతి లేకుండా జిం1 భవనాన్ని నిర్మాణం చేసినందున, యజమానికి నిబంధనలను అనుసరించి గతంలో మూడుసార్లు షోకాజ్ నోటీసు ఇచ్చినా ఎలాంటి సమాధానం లేక పోవడతో, 28 జూన్ 2024 రెవిన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో గల జిల్లా టాస్క్ ఫోర్స్ (డిటియఫ్) టీమ్ అనుమతి లేని భవనానన్ని కూల్చివేశారు. అదే కూల్చివేతలు మిగతా భవన నిర్మాణాలకు కూడా వర్తిస్తాయి కదా.! ఈ ఒక్క బిల్డింగ్ విషయంలో అంత నిక్కచ్చిగా వ్యవహరించిన అధికారులు, జిల్లాలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయంలో ఇలానే వ్యవహరించాలి కదా.? మిగతా నిర్మాణాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో వారికే తెలియాలి.