- గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తల భూములు కొల్లగొట్టిన ఎమ్మెల్యే బ్రదర్స్..
- ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే
- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్నిరోజులైనా వారికి న్యాయం జరగక పోవడంలో మతలబెంటి..?
- నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలు చేసిన డాక్యుమెంట్లను ఈడి అటాచ్ చేసినా వీరి ఆగడాలు ఆగడం లేదు..
- కాంగ్రెస్ ప్రభుత్వం లో నేటికీ న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు..
- బోగస్ పత్రాలతో వందలకోట్ల విలువైన భూములను కొల్లగొట్టి ఎంజాయ్ చేస్తున్న గూడెం బ్రదర్స్..
- కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ న్యాయం చేస్తుందని ఆశాభావం..
- అవినీతిని అసలు సహంచని గ్రేట్ లీడర్ మీనాక్షి అన్నది జగమెరిగిన సత్యమే..
పది సంవత్సరాలు బీఆర్ఎస్ రాక్షస పాలనలో అన్ని వర్గాలు అతలాకుతలం అయిపోయాయి.. బీఆర్ఎస్ లీడర్లందరూ దోచుకోవడం, దాచుకోవడమే ఎజెండాగా సాగించారు.. అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయి అన్నది విశ్లేషకుల వాదన.. అయితే అప్పట్లో ఎన్నెన్నో కష్టాలు పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు, చోటా మోటా నాయకులు.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంతగానో సంతోషపడ్డారు.. కానీ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని పఠాన్ చెరు నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.. అసలు విషయం ఏమిటంటే..
గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఒక వెలుగు వెలిగాడు.. బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నాయకుడు, ఒక మంత్రి సహాయంతో, అండదండలతో రెచ్చిపోయాడు.. ఎకరాలకు ఎకరాలు భూములు కొల్లగొట్టాడు.. వందల కోట్ల విలువైన మైనింగ్ను దోచుకున్నాడు.. ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేశాడు.. వేల కోట్ల ఆస్తులను పోగు చేసుకున్నాడు.. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలకు సంబంధించిన సొంత భూములకు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని సైతం కొల్లగొట్టేసి అక్రమాలకు పాల్పడ్డాడు గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అన్న బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఎన్నెన్నో అరాచకాలు చేసి సామాన్య జనాలను మోసం చేసి నట్టేట ముంచిన చరిత్ర అందరికీ తెలిసిందే.. మైనింగ్ పేరుతో ప్రభుత్వానికే 300 కోట్ల పై చిలుకు టోకరా చేశాడనీ ఇటీవలే అధికారులు తేటతెల్లం చేసిన విషయం విదితమే.. ధరణిని అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంలో అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వ భూములను కూడా ఎట్లా కొల్లగొట్టాడో చెప్పాల్సిన పనిలేదు.. తన అన్న అధికారం అడ్డుపెట్టుకుని చేయని దుర్మార్గాలు లేవు.. కాగా వీరి అవినీతి కార్యకలాపాలు చూసి ఈడీ కొరడా ఝుళిపించింది.. కొన్ని ఆస్తులను అటాచ్ చెయ్యడమే కాకుండా మైపాల్ రెడ్డి తమ్ముడిని అరెస్ట్ కూడా చేసింది.. అయితే బెయిల్ మీద బయటకు వచ్చి కుక్కతోక వంకర అన్న చందాన తన అవినీతి కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగించాడు.. ఉదాహరణకు చక్ర పూరి కాలనీలో ఉన్న గోల్డెన్ కి వెంచర్ మునుత్ ట్రస్ట్ పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని దర్జాగా నిర్మాణ పనులు చేపట్టి పేద ప్రజల ప్లాట్లను ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దర్జాగా అక్రమ నిర్మాణం చేపట్టిన నేటికీ దానిని కూల్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది..
అసలు విషయం ఏమిటంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా గూడెం బ్రదర్స్ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు చెందిన భూములను నకిలీ పత్రాలు సృష్టించి అడ్డగోలుగా కొల్లగొట్టారు.. అప్పట్లో తమ గోడు వినేవారు ఎవరూ లేక వారందరూ మిన్నకుండి పోయారు.. అదృష్టవశాత్హూ తెలంగాణాలో రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.. తమ ప్రభుత్వం వచ్చాక తమకు న్యాయం జరిగి, తమ ఆస్తులు తమకు దక్కుతాయని వారంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు.. అయితే పుండు మీద కారం జల్లినట్లు సదరు మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవడం జరిగింది.. ఇంకేముంది.. తమ అవినీతి కార్యకలాపాలు యధావిధిగా కొససాగించసాగారు.. దీనితో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల భూములు కొల్లగొట్టిన మహిపాల్ రెడ్డి అరాచకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టలేక దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు పడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మరి మోసపోయిన, అన్యాయం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరిగేది ఎట్లా అన్నది నేడు ప్రశ్నార్ధకంగా మారింది..? కనీసం సీఎం రేవంత్ రెడ్డి కూడా వారి గురించి ఆలోచించడం లేదు.. ఎందుకు ఇలా జరుగుతోంది..? గూడెం మహీపాల్ రెడ్డి కి ఆయన లొంగిపోయాడా..? లేక ఏదైనా మతలబు జరిగిందా..? లేక మంత్రి దామోదర రాజనర్సింహ ఇలాకాలో ఇంత అరాచకాలకు పాల్పడుతున్న చెక్ మెంట్ ఎందుకు పెట్టలేకపోయారు అన్నది అంతుచిక్కని ప్రశ్న.. అసలు గూడెం మహిపాల్ రెడ్డి ఇతగాడి తమ్ముడు చేసే అరాచకాల వెనుక ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఎవరు.. ఎవరి అండదండలు చూసుకొని వీరు పెట్రేగిపోతున్నారు.. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పటాన్చెరువు నియోజకవర్గంలో బహిరంగంగా కబ్జా చేశాడని తెలిసిన చర్యలు చేపట్టకపోవడం వెనక మతలబెంటి..? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పటాన్చెరువు నియోజకవర్గంలో న్యాయం కోసం ఎదురుచూస్తున్న పేదలకు న్యాయం జరగాలని తమ భూములు తమకు దక్కాలని కబ్జాలు చేసిన గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన కబ్జాలకు చెక్ పెట్టాలని.. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకమైన పాలన అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు సామాన్య ప్రజలు..
అయితే రెండు రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా టెరిఫిక్ లేడీ లీడర్ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించారు.. పార్టీని చక్కబెట్టి పనిలో లీనమయ్యారు.. పేదల తరఫున నేనున్నానని భరోసాను ఇచ్చారు.. తాను ఏమి చేయబోతోందో ఆమె పార్టీ శ్రేణులకు చెప్పకనే చెప్పింది.. ఓ రకంగా ఇది హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు.. మీనాక్షి నటరాజ్యం దృష్టికి టిఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార అడ్డుపెట్టుకొని కబ్జాలు చేసిన గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధు సుదర్శన్ రెడ్డి చేసిన అరాచాకాలపై, చేసిన కబ్జాలపై, సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లపై, కొల్లగొట్టిన ప్రభుత్వ ఆస్తులపై దృష్టి సారించి.. పటాన్చెరువులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయానికి, దగాకు గురైన తమ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తుందా.. ? అవినీతిని టన్నులుగా మూట గట్టుకున్న ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటుందా..? అన్న అంశం ఆసక్తి కరంగా మారింది.. నిజాయితీ పరురాలిగా.. అవినీతిని సహించని మహిళా లీడర్ గా ఆమె తీసుకోబోయే చర్యలు ఏమిటి అన్నది వేచి చూద్దాం మరి.. గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అమీన్పూర్ లో చక్రపురి కాలనీ లేఅవుట్ లో చేసిన అక్రమ దందాలు, సృష్టించిన బోగస్పత్రాలు, బినామీల పేరుతో చేసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్లు, పోచారంలో చేసిన కబ్జాలు సృష్టించిన నకిలీ పత్రాలు, క్రియేట్ చేసిన బోగస్ లేఔట్ లు, కొల్లగొట్టిన ప్రభుత్వ భూములకు సంబంధించి మీనాక్షి నటరాజన్ చర్యలు చేపట్టే వరకు వాస్తవాలు ఆధారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకురానుంది.. ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై”అస్త్రం.”