Thursday, November 21, 2024
spot_img

కాంగ్రెస్ కు జై కొడతారా,పోటీకి దిగుతారా..?

Must Read
  • ఏపీకి చంద్ర‌బాబు నాయుడు సీఎం..తెలంగాణకేంటి లాభం ?
  • తెలంగాణ‌లో కాంగ్రెస్తో దోస్తీ..ఏపీలో జనసేన,బీజేపీల‌తో పొత్తులు.. ?
  • తెలంగాణ‌లో పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు ఎలా తీసుకొవాలి ?
  • రెండు కండ్లన్న బాబు ఒకే కంటితో ఏపీనే ఎందుకు చూస్తున్నారు ?
  • ఏపీ లో టీడీపీ గెలిస్తే తెలంగాణ లీడర్లకు ఏం లాభం జరిగింది..?
  • ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ నడుస్తోందన్న ప్రచారంలో నిజమెంత ?
  • పతనావస్థలో టీజీకి అధ్యక్షుడు దొరికినప్పుడు, ఇప్పుడెందుకు దొరకడంలేదు ?
  • మోడీ మీద అలకమానిన బాబు, కాసాని మీద పంతం ఎందుకు కొనసాగిస్తున్నారు ?

తెలంగాణ రాష్ట్రంలో కొన్నివేలమంది కార్యకర్తలు,నాయకులు టీడీపీ పార్టీనే నమ్ముకుని టీడీపీ లోనే తమ భవిష్యత్తును ఊహించుకుని కొన్నెండ్లుగా రాజకీయాలు చేస్తున్నారు.వారికీ పార్టీ ఇప్పటివరకు ఏ చేసిందో.ఇకముందు ఎం చేయబోతుందో అంతు చిక్కని జవాబు గానే మిగిలిపోయింది..ఆస్తులను కాపాడుకోవడానికే తెలంగాణలో బాబు ఇంకా టీడీపీ పార్టీ ని నడిపిస్తున్నారని హుంకాలు,హుంకాలుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ వాటిలో నిజం లేదంటూ కొట్టిపారేస్తూ పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు,నాయకులకు టీడీపీ అధినాయకత్వం ఎం చేసిందో ఇకనైనా ఒక్కసారి మననం చేసుకుంటే మంచిది.. టీడీపీ జాతీయ నాయకుడు ఏపీ సీఎం అయ్యారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఏపీ కి మంత్రి అయ్యారు, జెండా మోసిన నేతలు జిందాబాద్ అంటూ గొంతెత్తి అరిచిన కార్యకర్తలు ఎక్కడ ఆగిపోయారో గద్దెనెక్కిన నాయకులు..ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది..గతంలో ప్రధాని మోడీ మీద అలిగి..అలకమానిన బాబు,ఎన్నికల సమయానికి మనసు మార్చుకుని మనస్పర్థలను పక్కన బెట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు లేవని చాటి చెప్పుతూ మోడీతో దోస్తీ కట్టారు.

తెలంగాణలో మీ ఆలోచనలకు, సిద్ధాంతాలకు విరుద్ధమైన పార్టీకి స్నేహ హస్తం అందించి అబ్బురపరిచారు.. మరి తెలంగాణాలో టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన కాసాని వంటి నాయకుడిని ఎందుకు దూరం పెట్టారో, పెడుతున్నారో అర్ధం కావడంలేదు.. ఇప్పుడు మీ పార్టీ తెలంగాణ పగ్గాలు చేపట్టే నాయకుడికి కాసాని కి ఎదురైన పరాభవం ఎదురుకాదని గ్యారంటీ ఏంటి..? ఎన్నికలు సమీపించేనాటికి కాంగ్రెస్ కో మరో పార్టీకో మరోసారి జై కొట్టరని గ్యారంటీ ఏంటి.. ? వ్యాపారాలతో వ్యవహారాలు నడిపిస్తున్న మీకు కోట్లు,లక్షలు లెక్కకాదు కావొచ్చు,కానీ సామాన్యులకు అవి తలకు మించిన భారంగా మారుతున్నాయని మీరు ఎందుకు గ్రహించడం లేదు.. రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కండ్లన్న బాబు ఒకే కంటితో ఒకే రాష్ట్రాన్ని ఎందుకు చూస్తున్నారు ? మాకు కాకపోయినా మీ నాయకులకు, మీ కార్యకర్తలకైనా జర బదులివ్వండి.. బాబు గారు..ప్లీజ్ ?

టీడీపీ అధికారంలో ఉన్నతన ఉనికిని కాపాడుకోలేకపోయింది :-

2014 లో ఏపీలో గెలిచిన టీడీపీ, 2019లో అనూహ్యంగా అధికారం కోల్పోయింది.2024లో తిరుగులేని మెజార్టీని ఏపీ లో సాధించుకుని నేటికీ 100 రోజులు పూర్తయినప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిపై ఇంకా క్లారిటీ ఇచ్చుకోలేని పరిస్థితే కనబడుతోంది.. ఇక తెలంగాణ విషయానికొస్తే 2014, 2019 లో రెండు సార్లు గెలిచి అధికారంలో కొనసాగిన తెరాస 2023 లో ఎవ్వరు ఊహించని విధంగా అధికారం కోల్పోయింది. అధికారంలో ఉన్నప్పుడు తెరాస టీడీపీ పార్టీపై కన్నెర్ర చేసి టీడీపీ లో గెలిచిన ఎమ్మెల్యేలను, నాయకులను లాగేసుకుని ఏకంగా మంత్రి పదవులు,నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టింది.. దీంతో జగన్ కు అండ్ కో కు కేసీఆర్ బాగా దగ్గరయ్యారు.. 2014 నుంచి 2019 వరకు ఏపీ లో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోలేకపోయింది.. ఇక 2019 లో ఏపీ లో ఓడిన టీడీపీని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్,ఏపీ మాజీ సీఎం జగన్ లు మరింత కిందకు నెట్టేశారు..

బాబుకు అస్త్రంగా మారిన కాసాని కుటుంబం :-

రాజకీయంగా అణగదొక్కబడిన బాబుకు తెలంగాణ రాష్ట్రంలో 2022 లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , కాసాని వీరేష్ ముదిరాజ్ లు ఓ అస్త్రంగా మారిపోయారు.. వారిని పూర్తిగా నమ్మిన చంద్రబాబు టీటీడీపీ తెలంగాణ పగ్గాలు పూర్తిగా అప్పగించేశారు.వారు టీటీడీపీ శ్రేణులను ఒక్కటి చేయడంతో పాటు గడప గడపకు టీడీపీ, మినీ మహానాడు,సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలను నిర్వహించి టీటీడీపీ లో నూతన ఉత్తేజాన్ని తట్టిలేపారు.ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ఏపీ లో జగన్ గ్రాఫ్, తెలంగాణలో కేసీఆర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జీవసత్వాలు కోల్పోయిన టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , కాసాని వీరేష్ ముదిరాజ్ లు ప్రాణం పోశారనడంలో సందేహమే లేదు..తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి పూర్వ వైభవం వచ్చేసింది.. రెండు రాష్ట్రాల్లో టీడీపీ తిరుగులేని పార్టీగా రూపు దిద్దుకోవడానికి కావాల్సిన శక్తిని కూడగట్టుకుంది.అలాంటి సమయంలో అనూహ్యంగా స్కిల్ స్కామ్‌ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇరుక్కున్నారు, లేదా ఇరికించేశారు .. ఆ సమయంలోనే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యింది. దీంతో అనుకోని విపత్కర పరిస్థితులను టీడీపీ చవిచూసింది..

బాబు జైలులో ఉన్నసమయంలో :-

బాబు జైలులో ఉన్నారు . బాబు తనయుడు లోకేష్ టీడీపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.ఆ సమయంలో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ తో పలువురు తెలంగాణ టీడీపీ నాయకులు కలిసి తెలంగాణ ఎన్నికల పోటీపై చర్చించారు. మొదట ఎన్నికల్లో పోటీకి సిద్ధమని చెప్పిన టీడీపీ జాతీయ స్థాయి నేతలు మరో రెండు రోజుల తరువాత మాట మార్చి తెలంగాణ లో పోటీకి టీడీపీ సిద్ధంగా లేదని ప్రకటించేశారు..అప్పటివరకు పోటీ చేస్తుందని ప్రకటించిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్,కాసాని వీరేష్ ముదిరాజ్ లకు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాలనీ తహ తహలాడుతున్న తెలుగు తమ్ముళ్లకు ఎం చెప్పాలో ..ఎం చేయాలో..ఎలా బుజ్జగించాలో తోచక, వివరాలు అడుగుదామన్న టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ తో పటు పలువురు జాతీయ నాయకులు సమయమివ్వకపోవడంతో దిక్కు తోచని పరిస్థితిలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , కాసాని వీరేష్ ముదిరాజ్ లు టీటీడీపీ కి రాజీనామా చేశారు.. దీంతో వారిని కేసీఆర్ హక్కున చేర్చుకున్నారు..

ఏపీ లో టీడీపీ గెలిస్తే తెలంగాణకు ఏం లాభం జరిగింది.. ?

ఏపీ లో టీడీపీ కూటమి ఎవ్వరు ఊహించని విధంగా గెలుపుబావుట ఎగురవేసింది..అక్కడ టీడీపీ కూటమి సాధించిన భారీ విజయం ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి,ఇక్కడి లీడర్లకు,కార్యకర్తలకు ఏం లాభం చేకూర్చిందో అర్ధం కావడంలేదు..తెలంగాణాలో కాంగ్రెస్ తో దోస్తీ . ఏపీ లో జనసేన,బీజేపీ పార్టీలతో టీడీపీ పెట్టుకున్న పొత్తులపై ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రి లోకేష్ ఇప్ప్పటివరకు ఎక్కడ ఇసుమంతైనా క్లారిటీ ఇవ్వలేదు.. ఇస్తారన్న నమ్మకం కూడా టీటీడీపీ శ్రేణుల్లో లేదు ..రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కండ్లన్న బాబు ఒకే కంటితో ఒకే రాష్ట్రాన్ని చూస్తూ రెండవ కన్నును ఎందుకు మూసుకున్నారో రోజులు, నెలలు,సంవత్సరాలు గడుస్తున్న ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది..? మాజీ సీఎం జగన్ తన పార్టీ కానీ వ్యక్తి , తెలంగాణకు చెందిన ఆర్ కిష్టయ్యకు రాజ్యసభ ఇచ్చి శభాష్ అనిపిచ్చుకున్నారు .మరి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ లీడర్లకు రాజ్యసభ కాకపోయిన టీటీడీ చైర్మెన్ గానైన అవకాశం ఇస్తారా .. లేదంటే కనీసం బోర్డు సభ్యులుగా నైనా అవకాశం కలిపిస్తారా..? తెలంగాణ టీడీపీ నాయకులు,లీడర్లు ఇకనైనా ఆలోచించండి. మిమ్ములను నమ్ముకున్న క్యాడర్ కోసమైన అధిష్టానాన్ని నిలదీయండి.. పార్టీ బాగుపడింది కదా మీ బతుకులను కూడా బాగుచేయమని నేతలను అడగండి.ఎట్ లీస్ట్ మీ కోసం కాకపోయిన మీ కుటుంబ సభ్యుల కోసమైన మీరు ఆరాధించే నేతలతో మనసు విప్పి మాట్లాడండి ..మీకు ఏమైన చేయమనండి బ్రదర్

Latest News

పోలీస్ పహరాలో మహబూబాబాద్ జిల్లా..144 సెక్షన్ అమలు

మహాబూబాబాద్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. లగచర్లలో గిరిజన, పేద రైతులపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS