తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం లగచర్లలో భూసేకరణను ఉపసంహరించుకున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది.