- ఏబీవీపీ రాష్ట్ర నాయకులు కమల్ సురేష్
ఎన్నో రకాల ఉద్యమాలను నాయకత్వం వహించి,విజయం సాధించి ఏబీవీపీ నేడు 76 సంవత్సరంలోకి అడుగుపెట్టింది అని అన్నారు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు కమల్ సురేష్.ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో అయిన పాల్గొన్నారు.ఈ సందర్బంగా కమల్ సురేష్ మాట్లాడుతూ,విద్యార్ధి దశలోనే నాయకత్వ లక్షణాలు,దేశభక్తి,విద్యార్థుల సమస్యలు,నిరుద్యోగుల కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటాలు చేసిన సంస్థ ఏబీవీపీ అని తెలిపారు.ఆర్టికల్ 370 రద్దు,సీఏఏ ఎన్.ఆర్.సి అమలు,భవ్య రామ్ మందిర నిర్మాణం,జాతీయ విలువలు కలిగిన ఎన్.ఈ.పి 2020 విధానం కోసం రాజీలేని పోరాటాలు చేసి చివరికి విజయం సాధించిందని అన్నారు.కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశం నలుమూలల విస్తరిస్తూ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్దగా విద్యార్ధి సంస్థగా నిలిచిందని వెల్లడించారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఏబీవీపీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తుచేశారు.రాజ్ నహి సమాజ్ బదల్న( పాలించే వ్యక్తులు మారినంత మాత్రాన ఈ సమాజంలో మార్పు రాదు,సమాజంలో మార్పు రావాలి)అనే విషయాన్ని నమ్ముతూ సమాజంలో మార్పుకై ఏబీవీపీ నిరంతరం నేషన్ ఫస్ట్ ఫిలాసఫీతో విద్యార్థులలో జాతీయ భావాన్ని పెంపొందిస్తూ పని చేస్తుందని తెలియజేశారు