జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది.. ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంత కాలం మాత్రమే ఉంటుంది.. ఏది ఎప్పుడు వదలిపోవాలో అప్పుడే పోతుంది.. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు..
నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడమే..
ఏకాంతాన్ని ఇష్టపడు… అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.. కాలంతో స్నేహం చేయ్… ప్రతిక్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్ కి ప్రేమను పంచు నీ జీవిత పయనానికి గమ్యం చూపిస్తుంది.. నీ కన్నీటికి ధైర్యం చెప్పు.. కష్టం కూడ నీకు దాసోహం అవుతుంది.
- వెంకటేష్