Friday, February 21, 2025
spot_img

ద‌ర్జాగా అక్ర‌మ క‌ట్ట‌డాలు.. పట్టించుకోని అధికారులు..

Must Read
  • మూడు పువ్వులు ఆరు కాయలుగా అధికారుల సంపాదన
  • ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.. పట్టించుకోని జిహెచ్‌ఎంసి ఉన్నత అధికారులు

మల్కాజిగిరిలో అక్రమ కట్టడాలు లెక్కకు లేనన్ని దర్జాగా నిర్మాణం అవుతున్న, టౌన్‌ ప్లా నింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి జిహెచ్‌ఎంసి కార్యాలయానికి కూత వేటు దూరంలో ఎన్నో అక్రమ నిర్మాణాలను జరుగుతున్న అధికారులు మాత్రం ఏమి పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు చూస్తే టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మల్కాజిగిరిలో జరుగుతున్న కట్టడాల్లో, ప్రతి 10 కట్టడాల్లో, 8 అక్రమ కట్టడాలు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రతినిధుల నుండి మొదలుకొని, జిహెచ్‌ఎంసి, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల, అండదండలు లేకుండా అన్ని డివిజన్‌ లలో అక్రమ నిర్మా ణాలు ఎలా జరుగుతున్నాయి. ఎవరి స్థాయిలో వారు అక్రమ కట్టడాలకు వత్తాసు పలుకుతూ అక్రమ సంపాదనతో తులతూగుతున్నారు. మల్కాజిగిరి డివిజన్‌ వాణి నగర్‌ వాణిజ్య బంగ్లా పై అక్రమంగా పెంట్‌ హౌస్‌ నిర్మాణం జరుగుతున్న, మల్కాజిగిరి చౌరస్తా ఆర్‌ 9000 ఆనుకుని అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్న, ఆరు డివిజన్‌ లలో ఇలా ఎన్నో అక్రమంగా నిర్మాణాలు జరుగుతుంటే, ఎక్కడో ఒకచోట అడపాదడపగా గోడలకు రంధ్రాలు కొట్టి, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నా మన్న కలరింగ్‌ ఇస్తున్నారే తప్ప, తాము తీసు కుంటున్న జీతానికి, తాము చేసే విధులకు న్యాయం చేయాలనే బాధ్యతలే మరిచారు. ప్రభుత్వానికి భారీ గండి కొడుతూ అధికారులు తమ సొంత స్వలాభం కోసం అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే జిహె చ్‌ఎంసి ఉన్నత అధికారులు మాల్కాజిగిరి వైపు కన్నెత్తి కూడాచూడకపోవడం శోచనీయం. ఇప్పటికైనా జిహెచ్‌ఎంసి ఉన్నత అధికారులు, మల్కాజిగిరి సర్కుల్లో జరుగుతున్న అక్రమ కట్ట డాలపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మల్కాజిగిరి పుర ప్రజలు కోరుతున్నారు.

Latest News

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బి.ఆనంద్‌ కుమార్‌ను అరెస్టు చేసిన ఎసిబి తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం పైలెట్‌ ప్రాజెక్టు సాంక్షన్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS