Wednesday, January 15, 2025
spot_img

నందు వ‌ర్సెస్ ద‌గ్గుబాటి ఫ్యామిలీ

Must Read
  • దగ్గుబాటి ఫ్యామిలీకి చుక్కలు చూపించిన నాంపల్లి కోర్టు..
  • దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్ ఐఆర్ నమోదు..
  • ఫిలిం నగర్ పోలీసులను అలెర్ట్ చేసిన నాంపల్లి 17వ నంబరు కోర్టు..
  • గత ప్రభుత్వంలో ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందం
  • ఫామ్ హౌస్ కేసులో నందు జైలుకు వెళ్ళగానే అక్రమంగా కూల్చివేత..
  • నందుకు సంబంధించిన కోట్ల విలువైన ఆస్తిని దగ్గుబాటి ఫ్యామిలీ ద్వంసం
  • మీ ఇష్టం వచ్చినట్టు కూల్చి వేయడానికి అదేమైనా సినిమా అనుకున్నారా..?
  • బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాధితుడు నందు ఫిర్యాదు చేస్తే నమోదు కాని కేసులు..
  • నాంపల్లి కోర్టు ఆదేశాలతో సురేష్ బాబు, రాణా, వెంకటేష్ లపై నమోదైన కేసు..

వెండితెరమీద ఆయన స్టెప్స్ వేస్తే అభిమానులు విజిల్స్ వేస్తారు.. విక్టరీనే తన ఇంటిపేరుగా మార్చుకున్న దగ్గుబాటి వెంకటేష్, ఆయన అన్న కుమారుడు మరో హీరో, బాహుబలి బల్లాలదేవా రాణా, రాణా తమ్ముడు అభిరాం.. ఈ ముగ్గురూ నిందితులుగా తేల్చింది కోర్టు.. తెరమీద హీరోయిజం చూపిస్తూ ఫామిలీ ఆడియన్స్ లో కూడా మంచిపేరు సంపాదించుకున్న హీరో వెంకటేష్ నిజజీవితంలో ఇంతటి విలనా..? అంటూ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.. తమ అభిమాన హీరో ఇలాంటివాడా..? అనుకుంటూ ఆశ్చర్యానికి గురౌతున్నారు.. అసలు కథ ఏమిటో చూద్దాం..

సిటీ సివిల్ కోర్టులో ఒక అంశం పెండింగ్ లో ఉండగా.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ.. దక్కన్ కిచెన్ హోటల్ ను విచక్షణారహితంగా కూల్చివేసిన దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు చెప్పినట్టుగా పెద్ద షాకిచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి, సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో శనివారం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఫిల్మ్ నగర్ లోని దక్కన్ కిచెన్ హోటల్ అక్రమంగా కూల్చి వేసిన ఆరోపణలపై హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్ పై శనివారం ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452, 458, 120 బి సెక్షన్లపై కేసు నమోదు చేసి ఎఫ్ ఐఆర్ నమోదుతో విచారణ చేపట్టారు.

గతంలో ఒక ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో బాధితుడు నందకుమార్ కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరింది. కాగా, 2022 నవంబరులో జిహెచ్ ఎంసీ సిబ్బంది.. తమ సొంత బౌన్సర్లతో కలిసి హోటల్ ను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని.. సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా.. 2024 జనవరిలో హోటల్ ను దగ్గుబాటి కుటుంబం దౌర్జన్యంతో పూర్తిగా కూల్చి వేసింది.. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్లగా.. శనివారం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ లు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నంద కుమార్ ఏండ్లుగా పోరాడుతున్నారు. కాగా, శనివారం 11న నాంపల్లిలోని 17వ నంబరు కోర్టు దగ్గుబాటి కుటుంబం పై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని.. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కోటాను కోట్లు సంపాదించినా ఆశ చావని దగ్గుబాటి కుటుంబం దౌర్జన్యకాండ కు దిగడం ఏమిటని పలువురు అభిమానులు, విశ్లేషకులు విస్తుపోతున్నారు.. టిఆర్ఎస్ ప్రభుత్వంలో దగ్గుపాటి ఫ్యామిలీ ఏలాంటి అరాచకాలకు పాల్పడింది..? నందకుమార్ ఆస్తిలోకి అక్రమంగా ప్రవేశించి ఎన్ని కోట్ల నష్టం కలిగించారు..? సురేష్ బాబు చేసిన అరాచకాలు ఏంటి..? బిఆర్ఎస్ ప్రభుత్వం లో చక్రం తిప్పిన నాయకుడు ఎవరు..? మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం వెనుక ఉంది ఎవరు.. అన్న అంశాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది “ఆదాబ్ హైదరాబాద్” మా అక్షరం అవినీతిపై “అస్రం”

Latest News

‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు

సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం, నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS