Wednesday, January 8, 2025
spot_img

మునీరాబాద్ ఎస్ కె ఎం పాఠశాలలో 2కె రన్ పోటీ

Must Read
  • ముఖ్య అతిధిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి

మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం గ్రామంలో ఉన్న ఏస్ కె ఎం ఉన్నత పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో లో ఘనంగా 2కె రన్ పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని సూచించారు. మొబైల్ లకు టీవీ లకు దూరంగా ఉంటే భవిష్యత్తు కు బంగారు బాటలను వేసుకోవొచ్చని కొనియాడారు. అనంతరం ఆయన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 700 మంది విద్యార్థిని, విద్యార్థులు 150 మంది ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు. సౌత్ జోన్ జాయింట్ సెక్రటరీ పసుపులేటి నరేందర్, బివిపి ప్రెసిడెంట్ తెలంగాణ ప్రాంత్ సతీష్ గౌడ్, బివిపి క్రీడా భారత్ కన్వీనర్ తెలంగాణ ప్రాంత్ లవ కుమార్ గౌడ్, ట్రప్సా మేడ్చల్ ప్రెసిడెంట్ రామేశ్వర్ రెడ్డి, ట్రాప్సా ప్రెసిడెంట్ వినోద్ యాదవ్ ,సాధన గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ ప్రవీణ్ రెడ్డి, ఎస్ కె ఎం. ఉన్నత పాఠశాల డైరెక్టర్ శృతి గౌడ్, పివి స్కూల్ కరస్పాండెంట్ నర్సింలు గౌడ్, ఏ ఎం ఎస్ స్కూల్ కరస్పాండెంట్ ఇమ్రాన్ పాల్గొన్నారు.

Latest News

‘సంక్రాంతికి వస్తున్నాం’

అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఫన్-ఫిల్డ్ &...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS