Thursday, October 23, 2025
spot_img

8న వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లుపై తొలిసారి సమావేశం

Must Read

‘వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌’(One Nation.. One Election) బిల్లుపై ఏర్పాటైన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వచ్చే నెల 8న తొలిసారి సమావేశం కానుంది. కమిటీ ఛైరపర్సన్‌తోపాటు సభ్యులు అంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేవం అజెండాకు సంబంధించిన వివరాలను కేంద్ర న్యాయ శాఖ కమిటీ సభ్యులకు తెలియజేయనుంది. జనవరి 8న ఉదయం 11 గంటలకు సమావేశం మొదలుకానుంది. ఈ విషయాన్ని కమిటీ జాయింట్‌ సెక్రెటరీ గుండా శ్రీనివాసులు ఒక ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వచ్చే జనవరి 9న తొలిసారి సమావేశం కానుందని, సభ్యులందరూ సమావేశానికి హాజరు కావాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This