Wednesday, January 15, 2025
spot_img

కార్పొరేట్‌కు దీటుగా ఉస్మానియా

Must Read
  • గోషామహల్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం
  • నెల‌ఖారులోగా శంకుస్థాప‌న‌కు చేయాలి
  • నలువైపులా రహదారులు ఉండాలని సూచన
  • 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం
  • భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలి
  • అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

హైదరాబాద్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి శంకుస్థాపనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంకల్పించింది. ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం తన నివాసంలో ఆసుపత్రి నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన సీఎం, గోషామహల్‌లో ప్రతిపాదిత స్థలం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ భూమిని వైద్య ఆరోగ్య శాఖకు త్వరితగతిన బదిలీ చేయాలని ఆదేశించారు. భూ బదలాయింపు ప్రక్రియతోపాటు, ఇతర అవసరమైన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ప్రతిపాదిత స్థలంలో నిర్మాణాలకు సంబంధించి అధికారులు సమర్పించిన నమూనా మ్యాప్‌లను సీఎం పరిశీలించారు. అధికారులు సూచించిన మ్యాప్ లలో పలు మార్పులు, చేర్పులను సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా దవాఖాన నిర్మాణం ఉండాలన్నారు. రోగులకు మరియు వారి సహాయకులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలన్నారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలని చెప్పారు. అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా అత్యాధునిక వసతులతో నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు.

Latest News

‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు

సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం, నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS