Wednesday, January 15, 2025
spot_img

మాజీ ఎంపీ జగన్నాథం కన్నుమూత

Must Read
  • గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు
  • నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన మంద
  • నాగర్‌ కర్నూల్‌ ఎంపీగా వరుసగా 4సార్లు ఎన్నిక
  • మందా జగన్నాథం మృతిపట్ల రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
  • మంత్రులు, పలువురు ప్రముఖుల సంతాపం

మాజీ ఎంపీ, సీనియర్‌ నేత డాక్టర్‌ మందా జగన్నాథం (73) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతేడాది డిసెంబర్‌ చివరి వారంలో మంద జగన్నాథం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూన్నారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని నిమ్స్‌లోని ఆర్‌ఐసీయూ విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడిరచారు. నాటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

మందా జగన్నాథం మృతి పట్ల ఆయన సహచరులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నేడు (సోమవారం) ఆయన స్వస్థలంలో మందా జగన్నాథం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో చికిత్స పొందుతోన్న మందా జగన్నాథంకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, దామోదర రాజ నర్సింహా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న జగన్నాథంను పరామర్శించి మెరుగైన వైద్య సహయం అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

మంద జగన్నాథం 1951, మే 22న నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ఇటిక్యాలలో జన్మించారు. ఆయన తండ్రి పేరు పెద్ద పుల్లయ్య. రాజకీయ నేపథ్యం చూస్తే 1996లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో మందా జగన్నాథం చేరారు. అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాగర్‌ కర్నూల్‌ లోక్‌ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. ఇదే పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో నాలుగు సార్లు.. 1996, 1999, 2004, 2009 ఆయన ఎంపీగా విజయం సాధించారు. అయితే 2009లో ఆయన టీడీపీ వీడి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఆయన ఎంపీగా అదే స్థానం నుంచి గెలుపొందారు. ఇక 2014లో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు.. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో.. ఆయన కాంగ్రెస్‌ పార్టీ వీడి.. నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో చేరారు.
అదే సమయంలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరగడంతో.. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా నాగర్‌ కర్నూల్‌ స్థానం నుంచి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు.ఈ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో మందా జగన్నాథం ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. కానీ నాటి కేసీఆర్‌ ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. అందులోభాగంగా.. 2018లో న్యూఢల్లీిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. దీంతో ఆయనకు కేబినెట్‌ హోదా సైతం కేటాయించింది. ఈ పదవి కాలం పూర్తయిన అనంతరం ఆయనకు ఈ పదవిని మరోసారి రెన్యూవల్‌ సైతం చేసింది. ఆ తరువాత 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కలేదు. ఇక 2023 ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో 2023 నవంబరు 17న బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. కాంగ్రెస్‌ పార్టీ నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ సీటు ఇవ్వకపోవడంతో హస్తం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌ ఆధ్వర్యంలో 18 ఏప్రిల్‌ 2024న బహుజన్‌ సమాజ్‌ పార్టీలో చేరాడు. అనారోగ్యం కారణంగా కొంత కాలంగా ఆయన పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు.

జగన్నాథం మృతి పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం:
మందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. నాగర్‌ కర్నూల్‌ లోక్సభ సభ్యుడిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారునిగా మందా జగన్నాథం పాత్ర తెలంగాణ రాష్ట్రంలో మరపురానిదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారని రేవంత్‌ రెడ్డి అన్నారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటుని ఆయన సేవలు కొనియాడారు.

జగన్నాథం మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్‌సంతాపం:
నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. 15 వ లోక్‌ సభ లో తనతో పాటు మందా జగన్నాథం పార్లమెంట్‌ సభ్యులుగా ఉన్నారని ఉద్యమ సమయంలో కూడా తనతో కలిసి పని చేశారని ,గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రణబ్‌ ముఖర్జీ ఆగ్రహానికి గురై గుండెపోటు కి గురైన మందా జగన్నాథం ఉద్యమాన్ని అపలేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇటీవల అనారోగ్యం భారిన పడిన విషయం తెలుసుకొని నిమ్స్‌ హాస్పిటల్‌ లో మందా జగన్నాథం గారితో మాట్లాడిన మాటలను మంత్రి పొన్నం ప్రభాకర్‌ గుర్తు చేసుకున్నారు. మందా జగన్నాథం మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మంద జగన్నాధం మరణం తనను తీవ్రంగా కలచివేసింది :ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎంపీ మంద జగన్నాధం మరణం తనను తీవ్రంగా కలచివేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దళితుల అభివృద్ధికి, సంక్షేమానికి మంద జగన్నాధం ఎంతో కృషి చేసారని తెలిపారు. దళితుల హక్కుల కోసం వారి అభ్యున్నతి కొరకు క మంద జగన్నాధం అహర్నిశలు కృషి చేసారని కొనియాడారు. మందా జగన్నాధం నాకు అత్యంత సన్నిహితుడని, అతను గొప్ప పార్లమెంటీరియన్‌ అని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Latest News

‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు

సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం, నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS