Sunday, September 7, 2025
spot_img

శబరిమల అయ్యప్పస్వామి ఆలయం మూసివేత

Must Read

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగిశాయి. దీంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డు అధికారులు వెల్లడిరచారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్‌ రాజరాజ వర్మ అయ్యప్ప(AYYAPPA) దర్శనం చేసుకున్న తర్వాత సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆలయాన్ని మూసివేశామని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో 53 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రెండు నెలల పాటు జరిగే మండల-మకర విళక్కు వార్షిక పూజల కోసం నవంబర్‌ 15న అయ్యప్ప ఆలయాన్ని పూజారులు తెరిచారు. మండల పూజ అనంతరం డిసెంబర్‌ 26న గుడిని మూసివేశారు. 41 రోజులపాటు సాగిన పూజల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. నాలుగు రోజుల విరామం తర్వాత డిసెంబర్‌ 30న సాయంత్రం 4 గంటలకు మళ్లీ ఆలయాన్ని తెరిచారు. ఈ సీజన్‌లో అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. రోజుకు లక్షలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. మొత్తం 53 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు టీడీపీ తెలిపింది. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి, తూర్పు మండపంలో గణపతి హోమం చేశామని. ఆ తర్వాత మేల్శాంతి అరుణ్‌ కుమార్‌ నంబూద్రి అయ్యప్ప విగ్రహానికి విభూతాభిషేకం నిర్వహించి, దానిని రుద్రాక్షలతో అలంకరించారని వెల్లడిరచారు. ‘హరివరాసనం’ పారాయణం తర్వాత మేల్శాంతి ఆలయ దీపాలను ఆర్పి గర్భగుడిని అధికారికంగా మూసివేశామని చెప్పారు. అనంతరం ఆలయ తాళాలను రాజకుటుంబ సభ్యుడికి అప్పగించామని తెలిపారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This