Saturday, October 18, 2025
spot_img

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ వందేళ్లు వెనక్కి

Must Read
  • మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు

కాంగ్రెస్‌ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. రేవంత్‌ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. అర్థిక పరిస్థితి తెలిసీ తెలియక హామీలిచ్చామని స్వయంగా అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను నిలువునా మోసం చేస్తుంది. చేతిలో ఎర్రబుక్కు పట్టికొని దేశమంతా తిరిగే రాహుల్‌ గాంధీ తెలంగాణ పరిస్థితులపై ఎందుకు మాట్లాడడం లేదు..? అన్ని రంగాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైంది అని కవిత మండిపడ్డారు. అబద్దాలతో సీఎం రేవంత్‌ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారు. అబద్దం అద్దం ముందు నిలబడితే రేవంత్‌ రెడ్డి బొమ్మ కనబడుతుంది. గ్రామ సభల్లో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. రైతు భరోసా, రేషన్‌ కార్డులు ఎవరికి ఇస్తున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. సచివాలయంలో ఏసీ గదుల్లో కూర్చొని తయారు చేసిన లబ్దిదారుల జాబితాను గ్రామాల్లోకి తీసుకొచ్చి చదువుతున్నారు. ప్రజలు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అధికారులను నిలదీస్తే అది తుది జాబితా కాదని మాటమారుస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తమ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్‌ కార్డులు ఇచ్చే ఆలోచనతో ఉంది. పసుపు పంటకు కనీస మద్ధతు ధర ప్రకటించడానికి బీజేపీ తక్షణమే చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This