- మండలంలో పాతుకుపోయిన ఏవో, ఎంపిఓ, ఏపీవో…
- సుదీర్ఘ కాలంగా ఒకేచోట విధులు
- పట్టింపు లేని శాఖధిపతులు.. వెంటనే బదిలీ చేయాలని ప్రజల డిమాండ్
పర్వతగిరి మండల కేంద్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఏవో, ఎంపిఓ, ఏపీఓ అధికారులకు బదిలీ ఎందుకు జరగడంలేదనే అంశంపై జోరుగా చర్చ కొనసాగుతుంది. ఎంపీడీవో మారినా ఈ అధికారులు ఎందుకు మారడం లేదనే అంశంపై గత కొన్ని నెలలుగా మండల కేంద్రంలో చర్చ కొనసాగడం కొసమెరుపు. మండల వ్యవసాయ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మండల పంచాయతీ అధికారి తదితర అధికారులు ప్రధాన శాఖల్లో సుదీర్ఘ కాలంగా ఒకేచోట విధులు నిర్వహించడం ద్వారా గ్రామాల్లో పరిచయాలు ఏర్పాటు చేసుకుని వ్యవహరిస్తున్నారు. మండల ఎంపీఓ కొంతమంది గ్రామపంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యంతో కొన్ని గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని, గ్రామాల అభివృద్ధి జరగాలనే ఆలోచన ఈ అధికారికి కనబడడం లేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. రైతులు సాగు చేస్తున్న పంటలపై నిరంతరం అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫెర్టిలైజర్ షాపుల యజమానులు యూరియా బస్తాలను రైతులకు అధిక రేటు అమ్మడం, మేమే బయట 320 రూపాయలకు కొనుగోలు చేసి మీకు 300లకు ఇస్తున్నామని, కేవలం మా దగ్గరికి రెగులరుగా వచ్చే వినియోగదారులకే ఇస్తున్నామ ని చెప్పడం చూస్తుంటే అవి వారి సొంత ఆస్తిగానే పరిగణిస్తున్నారని ప్రజలకు హక్కు ఉందనే ఆలోచన మరిచారని, అలాగే కొందరు ఫెర్టిలైజర్ షాప్ నిర్వాహకులు సర్వర్ పనిచేయడం లేదని రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంటే పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు ఏ విధంగా పని చేస్తున్నారో చెప్పనవసరం లేదని, ఒక చింత నెక్కొండ గ్రామంలో జరిగిన పలు రకాల ఆరోపణలకు సంబంధిత వ్యవసాయ అధికారి రైతులకు చేసిన మేలు ఏమీ లేదని రైతులు బహిరంగనే విమర్శిస్తున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్ ల సహకారంతో మూడు పువ్వు లు ఆరుకాయలుగా విలసిల్లు తోంది. ఈజీఎస్ పనులు చేయని వారికి మస్టర్ లో పేరు నమోదు చేస్తూ ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నారని, ఒక మాటలో చెప్పాలంటే దొంగలకు తాళం చెవి ఇచ్చినట్లు ఉందని, ఇందుకు నిదర్శనం ఇటీవల ఎంపిక చేయబడిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భూమిలేని రైతులకు ఆ పథకానికి ఎంపిక కాకుండా ఉండడం, భూస్వాముల పేర్లు ఈజీఎస్ లో పనిచేసినట్లుగా ఉండడం ఇందుకు నిదర్శనమని ప్రజలువిమర్శిస్తున్నారు. ఈ మండల అధికారులు ఏళ్లకు పైగా మండలంలో కొనసాగుతుండడంతో అవినీతి, అక్రమాలు జరిగిందా లేదా అన్నది నిర్ధారించలేని పరిస్థితి దాపురిం చిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓకే మండలంలో మండల అధికారిగా 2 లేదా 3 సంవత్సరాలు పనిచేయాలని ఉన్న కానీ 5 నుండి 7 ఏళ్లకు పైగా ఎలా కొనసాగుతున్నారనేది మండలంలో చర్చనీయాం శంగా మారింది. ఈ మండల అధికారులు బదిలీ కాకుండా చేసేది దెవరు.? అధికారులకు రాజకీయ నాయకులు, జిల్లా స్థాయి ఉన్నతాధికా రుల అండదండలు, ఉన్నాయని మండల ప్రజలు గుసగుసలాడు కుంటున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో వీరి ప్రభావం ఉంటుందని, తక్షణమే ఈ మండలాధికారుల బదిలీల విషయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, మండల ప్రజాపతినిదులు స్పందించి బదిలీకి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.