Monday, February 24, 2025
spot_img

మారుతీ కాలనీ స‌ర్వే నెం. 199/28 కబ్జా కాదు..

Must Read
  • గత 30 ఏళ్ల క్రితం ఈ స్థ‌లం కొనుగోలు చేశామ‌న్న మంత్రి లక్ష్మణ్‌
  • కాప్రా తహసీల్దార్‌పై రూ. 50 లక్షల పరువు నష్ట ధావా వేస్తాం
  • తహసిల్దార్‌ సుచరిత మాపై క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు

మారుతి కాలనీలో ఉన్నటువంటి 199/28 సర్వే నెంబర్లో గల 15 గుంట స్థలము ప్రభుత్వ భూమి కాదని, పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఉన్నాయని మంత్రి లక్ష్మణ్‌ అన్నారు. మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మణ్‌ మాట్లాడుతూ కుషాయిగూడ వాసులైన సయ్యద్‌ అమీర్‌ తండ్రి సయ్యద్‌ ముస్తఫ్‌ అనే వారసులకు చెందిన భూమి అని, గతంలో ఇక్కడ పీర్ల కొట్టం ఉండేదని తెలిపారు. అలాంటి భూమి మేము వారి వద్ద నుంచి 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశామని తెలిపారు. అలాంటి స్థలం చిందరవందరగా ఉన్నటువంటి స్థలాన్ని చదును చేసుకొని గత 30 సంవత్సరాలుగా మేమే ఉన్నామని ఆయన అన్నారు. ఇట్టి భూమి ప్రభుత్వ భూమి అయితే పట్టాదారు పాసు పుస్త కము ప్రభుత్వం ఎలా ఇస్తుందని ఆయన ప్ర‌శ్నించారు. స్థానిక తహసిల్దార్‌ సుచరిత ఎవరో వ్యక్తులు ఫిర్యాదు ఇస్తే, మాపై కక్ష పూరితంగా ఇలాంటి కూల్చివేతలు చేస్తున్నారని ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. కాప్రా తాసిల్దార్‌ సుచరిత మొదట లంచం అడిగారని, తహసీల్దార్‌ అడిగిన డబ్బులు ఇవ్వకుంటే ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆయన అన్నారు. కాప్రా తాసిల్దార్‌కు లంచాలు ఇస్తే ఎలాంటి భూమి నైనా వారి పేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తుందని మంత్రి లక్ష్మణ్‌ అన్నారు. కాప్రా రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్‌ ఎలాంటి పత్రాలు ఉన్నాయో చూపించమని మంత్రి లక్ష్మణ్‌ అడగగా పత్రాలను చూపించ లేదని, పోలీసుల సహకారంతో నా భూమిని కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై నేను కాప్రా తహసీల్దార్‌, రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ పై పరునష్ట దావా రూ. 50 లక్షలు ఇవ్వాలని కోర్టులో కేసు వేస్తానని మంత్రి లక్ష్మణ్‌ తెలిపారు. కాప్రా తహసిల్దార్‌ సుచరిత వివరణ కోరగా గతంలోనే అట్టి భూమిని స్వాధీనం చేసుకోవలసి ఉండగా అప్పటి తాసిల్దారు చేసుకోలేకపోయారని, అలాంటి భూములు ఎక్కడ ఉన్నా ఖ‌చ్చితంగా స్వాధీనం చేసుకుంటామని, మంత్రి లక్ష్మణ్‌ అనే వ్యక్తి మా వద్దకు ఒక్కసారి కూడా పత్రాలతో రాలేదని, ప్రభుత్వ భూమి కబ్జా చేస్తూ తప్పుడు ఆరోపణలు మాపై చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Latest News

మల్క కొమరయ్య ని ఆశీర్వదించండి..

పిలుపునిచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్.. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించిన మున్నూరు కాపు సంఘం.. ఉపాధ్యాయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్.. ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS