Sunday, February 23, 2025
spot_img

ప్రీ లాంచ్ పేరుతో వసూళ్ల దందా

Must Read
  • సాస్ ఇన్‌ఫ్రా కంపెనీ బరితెగింపు
  • అమాయక ప్రజలను దోచుకుంటున్న వైనం
  • భూమి రిజిస్ట్రేషన్ కాకుండా వ్యాపారం చేస్తున్న తీరు
  • అవినీతి అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న భూమాఫియా
  • కూకట్‌ప‌ల్లిలో గజం భూమి లేకుండా కోట్ల రూపాయల దోపిడి
  • పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి
  • ఎక్కడైనా చెప్పుకోండి మాకు ప్రభుత్వ అండదండలుంటూ బెదిరింపు
  • కూకట్‌ప‌ల్లిలో ఇలా ఉంటే కొల్లూరులో మరో దోపిడీకి తెర
  • సాస్ ఇన్‌ఫ్రా కంపెనీ యజమాని జీవి రావు బరితెగింపు
YouTube player

అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని వారి వీక్‌నెస్ లపై దెబ్బ కొట్టడమే రియల్ ఎస్టేట్ కంపెనీల పని.. ఎక్కడో అక్కడ ఏదో ఒక బోర్డు తగిలించుకొని ఆఫీసులో ఏర్పాటు చేసుకోవడం రంగురంగుల బ్రోచర్లతో ఆకట్టుకోవడం ప్రీ లాంచింగ్ పేరుతో మోసాలు చేయడం రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. ఇవే కాకుండా అందమైన సెలబ్రిటీలతో ప్రకటనలు ఇస్తూ ప్రీ లాంచ్‌ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారులను మోసం చేస్తున్నాయి కొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు. అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా స్థలాలు విక్రయించి కోట్లు ఆర్జిస్తున్నాయి. ఇలాంటి కోవకే చెందింది సాస్ ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ.. కూకట్‌ప‌ల్లిలోని ఐడిపిఎల్ చెరువు పక్కన ఉన్న (గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) జివోసిఎల్ సంబంధించిన 250 ఎకరాల భూమిలో మాకు 25 ఎకరాలు ఉంది అంటూ ఆక్కడ ప్రీ లాంచింగ్ పేరుతో.. సాస్ ఇన్‌ఫ్రా(SAS INFRA) ఎండి జివి రావు(G.V. RAO) దాదాపు రూ. 300 కోట్లు కొల్లగొట్టిన తెలుస్తుంది.. ఆదాబ్ హైదరాబాద్ లోతైన ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే జీవి రావు పేరు మీద కానీ అతని కంపెనీ పేరు మీద కానీ అక్కడ ఏ లాంటి భూమి రిజిస్ట్రేషన్ కాలేదు. కానీ అక్కడ భూమి ఉందంటూ మోసం చేయడం జి వి రావు నేచర్.. ఇలాంటి మోసగాళ్లు ఎన్నైనా చెబుతారు. విషయాని కొస్తే రియల్‌ రంగంలో ప్రీ లాంచింగ్‌ ఆఫర్లకు ఎందుకింతగా డిమాండ్‌ ఏర్పడింది..? అనుమతులు పొందని సంస్థలు ఇచ్చే ప్రీలాంచ్‌ ఆఫర్ల వలలో చిక్కితే కొనుగోలుదారులకు జరిగే నష్టం ఏంటి..? ఇలాంటి మోసాలబారిన పడుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..? రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే వ్యాపార ప్రకటనలు విడుదల చేస్తూ, ప్లాట్లు అమ్ముకుంటున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఎలా..? వాటి అక్రమాలపై చర్యలు తీసుకునే అధికారం ఏ ఏ ప్రభుత్వ విభాగాలకు ఉంది?

సాస్ ఇన్‌ఫ్రా(SAS INFRA) గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొల్లూరులో 10 ఎక‌రాల్లో హైరేజ్ అపార్ట్‌మెంట్లు నిర్మిస్తామని బ్రోచర్లతో భారీగా ప్రచారం చేస్తున్నారు. ఆలు లేదు సోలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు తక్కువ ధరకే ప్లాట్లు అందిస్తుందని ఈ ప్రీ-లాంచ్ పథకంతో ప్రజలకు ఎరవేస్తూ సాస్ ఇన్‌ఫ్రా కంపెనీ తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటలు చెప్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. మీరు అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఆ కాల పరిమితి మొత్తానికి వడ్డీతో డబ్బులు చెల్లిస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. కొనుగోలుదారులు ప్రాజెక్ట్ గురించి విచారించినప్పుడు, భూమి చట్టపరమైన సమస్యలలో చిక్కుకుందని మరియు కొంత సమయం పడుతుందని వారికి చెప్తున్నారు. వారు పత్రికల్లో వస్తున్న కథనాలను చూసి ప్రశ్నిస్తే ప్రభుత్వం మాకు అండదండగా ఉందని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పడం జరుగుతుంది.

హైదరాబాద్ లో వరుసగా రియల్ ఎస్టేట్ మోసాలు బయట పడుతున్నాయి. ఇప్పటికే న్యాయం చేయాలంటూ వందలాది మంది బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. తాజాగా మరో సాస్ ఇన్‌ఫ్రా(SAS INFRA) రియల్ ఎస్టేట్ కంపెనీ దగా వెలుగులోకి వచ్చింది. వీరికి నిజం చెప్పాలంటే ఇక్కడ కూడా భూములు రిజిస్ట్రేషన్ అయి లేవు. కానీ వీరు వినియోగదారులను ఆకట్టుకోవడంలో వారికి వారే సాటి.. ఇప్పటికే కూక‌ట్‌ప‌ల్లిలో మూడు నాలుగు వెంచర్లు అయిపోయాయని, మా కంపెనీ ద్వారా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ మంచి అవకాశాన్ని చేజార్చుకోవ‌ద్ద‌ని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా వీరి ప్రాజెక్టులు పూర్తయినట్టు, వీరి వినియోగదారులకు విల్లాలు కానీ, అపార్ట్‌మెంట్లు కానీ హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఎక్కడ లేదు.

ఇదిలా ఉంటే హైదరాబాద్ నగర శివారులో అత్యంత ఖరీదైన ప్రాంతంలో తక్కువ ధరకే ప్లాట్లు విల్లాలు అంటూ కొల్లూరులో మరో మోసానికి తెర లేపారు.. పది ఎకరాలలో అద్భుతమైన ప్రాజెక్టు చేపట్టామని డబ్బా కొట్టుకుంటున్నారు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి దొంగ కంపెనీలనను నమ్మి మోసపోకండి. మీతో పాటు మీ సన్నిహితులకు, బంధువులకు కూడా ప్రీ లాంచ్ దొంగ కంపెనీల గురించి తెలియజేయండి.. అందులో సాస్ ఇన్ఫ్రా(SAS INFRA) మోసాలు కోకోలలు. రియల్ ఎస్టేట్ మోసాలతో కోట్లు కోట్లు కొల్లగొట్టడం ఆ డబ్బునంత విదేశాలకు తరలించడం జరుగుతుందని, ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

రేరా అధికారులు, ప్రభుత్వం స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని మోసపోయిన బాధితులు పేర్కొంటున్నారు. ఇందులో కొంతమంది అవినీతి అధికారుల పాత్ర కూడా ఉందని వారిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, అవినీతి అధికారుల అండదండలతోనే సాస్ ఇన్‌ప్రా లాంటి దొంగ కంపెనీలు పుట్టుకొస్తున్నాయని విమర్శిస్తున్నారు.

సాస్ ఇన్‌ప్రా(SAS INFRA) కంపెనీ కాక మరెన్నో దొంగ కంపెనీల చిట్టా అంతా ఆదాబ్ చేతిలో ఉంది.. ప్రజలను మోసం చేసే ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇదే ఆదాబ్ హెచ్చరిక ప్రజల పక్షాన ఉంటూ ప్రతినిత్యం లైవ్ కథనాలను అందించడమే ఆదాబ్ హైదరాబాద్ పత్రిక కర్తవ్యం. మరిన్ని కథనాలతో సంచలన వార్తలతో త్వరలో మీ ముందుకు.

Latest News

నాణ్య‌త‌లేని సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS