Sunday, February 23, 2025
spot_img

సేవాలాల్ 286 వ జయంతి క్యాలెండర్ ఆవిష్కరణ

Must Read

ఆవిష్క‌రించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఎంపి కాంగ్రెస్ నాయ‌కులు రవీంద్ర నాయక్

దేశంలోని కోట్లాది బంజారాల కులదైవం సంత్ సేవాలాల్ 286 వ జయంతి క్యాలెండర్ ను బంజార హిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి(REVANTH REDDY) మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ అహింసా సిద్దాంతానికి పునాది వేసి అచరించి చూపారని తెలిపారు. బంజారాలు అనాడు రాజుల కాలం నుండి బ్రిటీష్‌కాలం వరకు అయా రాజ్యాలకు అవసరమైనయుద్ద సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండే వారని, సేవాలాల్ మహారాజ్ బోదనల వల్ల బంజారా జాతిపురోగమించడానికి కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు. అనంత‌రం పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్ మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి శుభాభినంద‌న‌లు తెలిపారు. ఇందిరమ్మ ప్రజాపాలనలో ఇచ్చిన ఆరు హామీల అమలు, చరిత్రలో రైతులకు రెండు లక్షలు ఒకేసారి రుణమాఫీ, నిరూపేదలకు లక్షలాది ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం, కేసిఆర్ కుటుంబ పాలనలో జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, భూకుంభ కోణాలు మరియు ఆర్థిక విధ్వంసాన్ని అరికట్టి రాష్ట్ర పాలనను గాడిలో పెట్టి, రెండు లక్షల 75 వేల కోట్ల విదేశీ పెట్టుబడులతో అనేక అభివృద్ధి కార్య క్రమాలతో సహా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాది కార్యక్రమాలు రూపొందించి నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు, ఇండ్లులేని పేదలకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రికి సేవాలాల్ ఆశిస్సులండాల‌ని ప్రార్ధించారు. కేసీఆర్, కేటీఆర్ వందిమాగదులు చేసిన లక్షల కోట్ల అవినీతి, శ్యాన్డ్, ల్యాండ్, లిక్కర్, డ్రగ్స్, గ్రైనేట్ కుంభకోణాలతో సంపాదించిన డబ్బుతో ఇందిరమ్మ ప్రజాప్రభుత్వంపై కేసీఆర్ అండ్ కో గోబెల్స్ ప్రచారం చేస్తున్న వీరికి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు కర్రుకాల్చి వాత పెట్టి, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నాయిచ్చినను వారి బుద్ది రాలేద‌ని అన్నారు.

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ‌
బంజారాల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి వేడుక సంద‌ర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శుక్ర‌వారం పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌గౌడ్ మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనన్నారు. గిరిజనులకు దశ-దిశను చూపి, హైందవ ధర్మం గొప్పతనం, విశిష్టతలను తెలియజేయడానికే సేవాలాల్ మహారాజ్ జన్మించినట్లు చరిత్రకారులు చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎంపీ రవీందర్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

Latest News

మల్క కొమరయ్య ని ఆశీర్వదించండి..

పిలుపునిచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్.. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించిన మున్నూరు కాపు సంఘం.. ఉపాధ్యాయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్.. ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS