Sunday, February 23, 2025
spot_img

వికసిత్‌ భారత్‌కి అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు

Must Read
  • సమ్మిళిత అభివృద్ధి.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన
  • రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు కోట్లాదిమందికి ఊరటనీచ్చే విషయం
  • ఆంధ్రప్రదేశ్‌ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి

2047 నాటికి వికసిత్‌ భారత్‌ (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యానికి అనుగుణంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిందని, దేశ స్థితిగతిని మార్చే విధంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయని, త్వరిత, సమ్మిళిత, అభివృద్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ అద్భుతమైన బడ్జెట్‌ రూపొందించారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురందరేశ్వరి అన్నారు. 2025- 2026 కేంద్ర బడ్జెట్‌ పై శుక్రవారం రోజున కరీంనగర్లోని వైశ్య భవన్లో మేధావులతో సదస్సుకు పురందరేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరైమాట్లాడారు. అంతకుముందు కరీంనగర్లోని శ్వేతా హోటల్లో బడ్జెట్‌ కేటాయింపుల అంశంపై మీడియాతో ఆమె మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపులపై తగిన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రధానంగా బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా కేటాయింపులు ఉన్నాయన్నారు. రక్షణ, విద్య, వైద్యం, వ్యవసాయం, స్కిల్‌ డెవలప్మెంట్‌ ల కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. రక్షణ రంగానికి 6 లక్షల 80 వేల కోట్లు, హోం మంత్రిత్వ శాఖకు రెండు లక్షల 33 వేల కోట్లు, వ్యవసాయ రంగానికి రెండు లక్షల 75 వేల కోట్లు, వైద్యానికి 96 వేల కోట్లు, విద్యకు 50 వేల కోట్లు ఇలా ప్రతి ఒక్క ప్రధాన రంగానికి అద్భుతమైన కేటాయింపులు ఈ బడ్జెట్‌లో జరిగాయన్నారు. ముఖ్యంగా 12 లక్షల వరకు ఇన్కమ్‌ టాక్స్‌ లేదనే ప్రకటన కోట్లాదిమందికి సంతోషాన్ని ఇచ్చిందన్నారు. గరీబి హటావో నినాదంతో దేశాన్ని దశాబ్దాలు ఏలిన కాంగ్రెస్‌ పేదరికాన్ని నిర్మూలించలేకపోయిందన్నారు. గత పదేళ్ల మోడీ ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధి, సంస్కరణలతో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధి మందగించిన భారత్‌ మెరుగైన పనితీరు సాధించిందన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఉచిత రేషన్‌ బియ్యం, గ్రామీణ ఉపాధి హామీ పనులునిధులతో డంపు యార్డ్‌ నిర్మాణాలు, సిసి రోడ్లు, డ్రైనేజీలు, స్వచ్ఛభార త్‌ ద్వారా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం , పల్లె ప్రకృతి వనాలు, ప్రతి గ్రామంలో వీధి దీపాలు, పంట నష్ట పరిహారం కింద పసల్‌ బీమా యోజన, మహిళలకు ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్‌ యోజన పథకం కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు, ప్రధానమంత్రి మాతృ వందన యువజన ద్వారా గర్భిణీ స్త్రీలకు సహాయం, దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంక్‌ అకౌంట్‌ను కల్పించాలనేఉద్దేశంతో జన్‌ ధన్‌ యోజన (జీరో అకౌంట్స్‌) తీసుకువచ్చి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్‌ జ్యోతి భీమా యోజన స్కీంలను అమలు చేస్తూ, నేరుగా ప్రతి సంక్షేమ ఫల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందన్నారు. అలాగే ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన, పీఎం కిసాన్‌ సమ్మన్‌ నిధి యోజన, పీఎం కిసాన్‌ మన్‌ ధన్‌ యోజన బ్యాంకు ద్వారా 60 సంవత్సరాలు దాటిన వ్యవసాయ కూలీలకు పింఛన్‌ పొందే పథకాన్ని తీసుకువచ్చిందన్నారు.

ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన, సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన, రాష్ట్రీయ గ్రామీణ అజీవక మిషిన్‌, ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన ద్వారా నిరుద్యోగులకు స్కిల్స్‌ కొరకు దేశవ్యాప్తంగా ఉచిత ట్రైనింగ్‌, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా ప్రతి ఒక్కరిఇంటి కల నెరవేర్చడం, ప్రధానమంత్రి ముద్ర యోజన (చిన్న వ్యాపారుల రుణం కోసం), అటల్‌ పెన్షన్‌ యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంతో 18 కులాలు 14 చేతివృత్తుల వారికి లబ్ధి చేకూర్చే ప్రోగ్రాం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. అలాగే స్టార్టప్‌, (మేకింగ్‌ ఇండియా ప్రోగ్రాం ) ద్వారా అంకుర పరిశ్రమలు, సర్వీస్‌ రంగాలకు తగిన ప్రోత్సాహం, నేషనల్‌ లవ్లీ స్టాక్‌ మిషన్‌, నాన్‌ అగ్రికల్చర్‌ (డైరీ, కోళ్ల, ఫిష్‌ యూనిట్లకు 50 లక్షల సబ్సిడీ తో) కార్యక్రమాలు, రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ పథకం ద్వారా స్వదేశీ ఆవుల రక్షణ, జాతుల అభివృద్ధి కొరకు, పాల ఉత్పత్తుల పెంపుదల కొరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీలు అందిస్తుంది అన్నారు. లేబర్‌ ఇన్సూరెన్స్‌, ఈ శ్రమ్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి స్కీంలతో ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేసిందన్నారు. అలాగే రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు , బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, నిరుద్యోగుల సంక్షేమం, అభివృద్ధికోసం అనేక పథకాలను తీసుకువచ్చి, వారందరికీ చేయూతనిస్తోందన్నారు. పదేళ్ల సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ప్రస్తుతం బడ్జెట్లో మరిన్ని కొత్త పథకాలను ప్రకటించిందన్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి, పండ్లు కూరగాయల ఉత్పత్తికి పీఎం దన్‌ దాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. అలాగే కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పరిమితి 3 లక్షల నుండి 5 లక్షల వరకు పెంపు, క్యాన్సర్‌ తో పాటు 36 రకాల ప్రాణం తగ్గ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌ పై కష్టం డ్యూటీ మినహాయించడం, ప్రభుత్వాసుపత్రిలో క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం, క్యాన్సర్‌ పేషెంట్లకు అవసరమైన మందులు చావుకోగా లభించే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేశారన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సంపదను సృష్టించడం కోసం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, మహిళల అభివృద్ధి కోసం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించారని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా బడ్జెట్‌ ఉందన్నారు. కానీ తల పేరుతో ప్రజలను మాయం చేసే వాళ్లకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు మింగుడు పడడం లేదన్నారు. బడ్జెట్‌ కేటాయింపులు ప్రతిపక్షాలకు, కొన్ని వర్గాలకు భయం కలిగించిందన్నారు. ఇట్టి సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, వికసిత్‌ భారత్‌ బడ్జెట్‌ ప్రోగ్రాం స్టేట్‌ కోఆర్డినేటర్‌ గంగిడి మనోహర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, జిల్లా అధ్యక్షులు గంగా డి కృష్ణారెడ్డి, తాజా మాజీ మేయర్‌ సునీల్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Latest News

నాణ్య‌త‌లేని సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS