Sunday, February 23, 2025
spot_img

ఖ‌జ‌నా ఖాళీ

Must Read
  • నిరుపయోగంగా స్మశాన వాటికలు, పల్లె క్రీడ ప్రాంగణాలు
  • నేతల జేబులు నింపుకునేందుకే…
  • కేంద్రనిధులు దారి మళ్ళించడంతో అభివృద్ధికి దూరంగా పల్లెలు…
  • జిల్లా వ్యాప్తంగా వృధాగా దర్శనం

గ్రామాలను అభివృద్ధి పరచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సిసి రోడ్లు, అంతర్గత రహదారులు, ఫార్మేషన్‌ రోడ్ల నిర్మాణం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కానీ గత పది ఏళ్ల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులను దారి మళ్ళించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడి పదేళ్లపాటు అభివృద్ధి పనులను కొనసాగించింది. అందుగ్గాను గత సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డంపింగ్‌ యార్డులు, వైకుంఠ దామం, పల్లె ప్రకృతి వనాలు, పల్లె క్రీడా ప్రాంగణాల పేరుతో ప్రతి గ్రామ పంచాయతీకి 50 నుంచి కోటి రూపాయల వరకు నిధులను ఖర్చు చేసింది. కానీ కమిషన్ల కోసమే ప్రభుత్వం అప్పట్లో నిధులను దారి మళ్ళించారని విమర్శలు ఉన్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రత్యేకంగా రాష్ట్ర బడ్జెట్‌ నిధులు లేకపోవడంతో అధికారంలో ఉన్న సర్పంచులు అభివృద్ధి పనులు చేయకపోవడంతో గ్రామంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు గతంలో తేల్చి చెప్పారు. దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించి ప్రతి గ్రామపంచాయతీలో డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామాలు, పల్లె క్రీడా ప్రాంగణాల పేరుతో పనులు చేపట్టాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగానే గతంలో అధికారంలో ఉన్న సర్పంచ్లు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో హాయ్‌ ఆ గ్రామపంచాయతీ పరిధిలోని నిర్మాణాలు చేపట్టారు. కొన్ని గ్రామాలలో అయితే విచిత్రంగా పల్లె క్రీడ ప్రాంగణాల పేర్లతో నిర్మాణం చేసినవి గ్రామానికి కిలోమీటర్ల దూరంలో ఉండడంతో నిరుపయోగంగా ఉన్నాయి. తెలంగాణలో ప్రత్యేకంగా స్మశానవాటికలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు వివిధ సంప్రదాయాల ప్రకారం స్మశాన వాటికలో శ్వాస నిర్మాణాలను సైతం (సమాదులు ) కట్టుకొని వారి జ్ఞాపకార్థం ప్రతియేటా సంవత్సరికం పేరుతో గుర్తు చేసుకుని ఉంటారు. వైకుంఠధామాలలో శవాలను దహనం చేయాలనే ఉద్దేశంతో నిర్మాణాలు చేపట్టిన సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా అలాంటి ఆనవాళ్లే లేదు. ఎందు కంటే హిందూ, క్రిస్టియన్‌, ముస్లిం సంప్రదాయం ప్రకారం ( బ్రాహ్మిన్స్‌, రెడ్డిలు) మినహా మిగతా వారిని దహనం చేయరు. అందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేసిన వైకుంఠధామాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ గా మారడంతో పాటు దిష్టిబొమ్మలుగా దర్శనమిస్తున్నాయి. డంపింగ్‌ యార్డులు నిర్మాణం చేసిన వాటిని సైతం సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. దీనికి ప్రజల్లో చైతన్యం కలిగించినప్పటికీ పంచాయతీల నిర్వహణ బాధ్యత భారంగా మారడంతో మొక్కుబడిగా చెత్త సేకరణ చేసి ఎక్కడపడితే అక్కడ ఖాళీ చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పల్లెలు అభివృ ద్ధికి దూరంగా గత 10 సంవత్సరాల పాటు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు కోట్లు ఖర్చు చేసి నిర్మాణం చేసిన వాటిని ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Latest News

నాణ్య‌త‌లేని సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS