Sunday, February 23, 2025
spot_img

ఆ రోజులే బాగుండే…

Must Read
  • పల్లె కుటుంబాలతో పశు సంపద సహజీవనం…
  • నాడు కల్మషం ఎరుగని రైతు..
  • నేడు పల్లెల్లో కానరానీ పశువులు..
  • విషపు ఆహారంతో ఇంటింటికో రోగి….
  • తప్పదంటున్న శాస్త్రవేత్తలు

తాను పండించిన పంటలో కొంత భాగం ఇంటిముందు సూరుకు వడ్లను వేలాడదీసి పిట్టలకు సైతం రైతు తినిపించేవాడు. నేడు విషపూరిత పంటల వల్ల కిచకిచమనే పిట్టలు రైతు ఇంటి ముందటికి రావడం లేదు తాను పండించిన విషపు పంటను పశు, పక్షులు తినడం లేదు.

పంటను కంటికి రెప్పలా చూసుకున్న రైతు నేడు ఆ పంటను ప్రజలకు అందించి అనారోగ్యం పాలు చేస్తున్నాడని కొందరు సేంద్రియ రైతులు, మేధావులు, శాస్త్రజ్ఞులు పదేపదే చెప్తుంటే పెడచెవిన పెడుతూ సేంద్రీయం వైపు అడుగులు వేయకుండా రైతు ఆలోచనలలో పడుతున్నాడు.

నాడు పూర్వకాలం నుండి గ్రామీణ వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి ఒక రైతు కుటుంబం లేదా ఒక పల్లె కుటుంబం ఆవాసం ఉన్నది అంటే ఆ కుటుంబ సభ్యులతో పాటు పిల్లి, కుక్క, ఆవులు, ఎడ్లు, బర్రెలు, కోళ్లు, గొర్రెలు, మేకలు ఆ ఇంటిలో సభ్యులై ఇంటి పరిసరాల్లో తిరుగుతూ పాలిస్తూ, మాంసాన్నిస్తూ, గుడ్లనిస్తూ వ్యవసాయానికి తోడుగా దుక్కి దున్నుతూ, బండి లాగుతూ ఇంటికి కాపలా ఉంటూ, ఇంట్లోకి పాములు ఎలుకలు రాకుండా నికార్సైన యుద్ధ సైనికులు కాపలా కాస్తు పిల్లి ఇలా రైతుకు రైతు కుటుంబాలకు గ్రామీణ కుటుంబాలకు తోడునీడగా వాటి వంతు సహకారం అందిస్తూ రైతు మూడు పూటలా భోజనం చేయడానికి అన్ని రకాలుగా సహకరిస్తూ తోడు నీడై పశు సంపద రైతుకు రక్షణ చేస్తుండేటివి. అప్పుడు రైతుకు కల్మషం లేదు తాను పంపించిన పంట కుటుంబ అవసరాలకు పోను మిగతాది అలనాడు పల్లెటూర్లో ఉన్న సేటు ఎంత రేటు చెప్తే ఎంతకి ఇచ్చేసి నవ్వుతూ తన తోటి ఉన్న పశుసంపదతో వాటికి సేవలు చేస్తూ వాటి సేవలు పొందుతూ కల్మషం లేని జీవితాన్ని గదిపేటివారు. తాను పండించిన పంటలో కొంత భాగం ఇంటిముందు సూరుకు వడ్లను వేలాడదీసి పెట్టలకు సైతం రైతు తినిపించేవాడు. నేదు విషపూరిత పంటల వల్ల కిచకిచమనే పిట్టలు రైతు ఇంటి ముందటికి రావడం లేదు తాను పండించిన విషపు పంటను పశు, పక్షులు తినడం లేదు. నాగరికత, టెక్నాలజీ, వ్యవసాయ యాంత్రీకరణ ఆ రైతు కుటుంబాలను కుదేలు చేసింది. అత్యాశతో విచ్చలవిడిగా ఎరువులను చల్లుతూ రసాయనిక మందులు వాడుతూ భూమిని నిస్సారం చేసి నిస్సహాయ స్థితిలో ఉన్న భూమృతదేహంపై వంటలు పండిస్తూ వికటట్టహాసం చేస్తూ ప్రపంచానికి అన్నం పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ నయ పాశ్చాత్తా నాగరికతకు అలవాటు పడిన రైతులు తన కుటుంబాల నుండి పిల్లిని, కుక్కును, బర్రెను, గొర్రెను, ఆవులను, ఎడ్లను దూరం చేసుకుని యాంత్రిక వ్యవసాయ విధానంతో పంటలు పండించి రసాయనిక మందుల పిచికారితో విషపు తిండి తింటూ ప్రపంచానికి విషపు తిండి పెడుతున్నాడు. నేడు ఒక్క రైతు కుటుంబమే 50 ఎకరాలు యాంత్రికరణ పేరుతో వ్యవసాయం చేస్తున్నప్పటికీ మిగిలేది తక్కువ అయినప్పటికీ తాను పెంచి పోషించుకున్న విషపు పంటతో విష జ్వరాల వారి నుండి పెద్ద పెద్ద రోగాల వరకు తన ఆరోగ్యాన్ని అనారోగ్యం చేసుకుంటూ జీవనం సాగిస్తూ వెనుకటి 80 ఏళ్ల తాత కేక పేడితే పిట్టలు పరారయిపోయేటివి. నేడు ఆ కూతలు పోయినయి, చెట్ల ఖాతలు పోయినాయి. నాటి పశు సంపద ఇచ్చే సేంద్రియ ఎరువుల జాడలేక ప్రకృతి విలయతాండవం చేస్తుంటే రైతు వాటి నాణ్యత పంటలు ఎటుపాయేనని దిగులు చెందుతుంటే పంటపై ఈ మందు కొట్టు ఆ మందు కొట్టు అని ప్రచారాలు టీవీల్లో, సోషల్ మీడియాలో వస్తుంటే ఎక్కువ పంట పండియాలని అత్యాశతో విచ్చలవిడి పురుగుల మందులు కొడుతుంటే ప్రపంచం విష జ్వరాల బారిన పడుతుంటే రైతు కంట కన్నీరు కారక తప్పుతుందా. పంటను కంటికి రెప్పలా చూసుకున్న రైతు నేడు ఆ పంటను ప్రజలకు అందించి అనారోగ్యం పాలు చేస్తున్నాడని కొందరు సేంద్రియ రైతులు, మేధావులు, శాస్త్రజ్ఞులు పదేపదే చెప్తుంటే పెడచెవిన పెడుతూ సేంద్రీయం వైపు అడుగులు వేయకుండా రైతు ఆలోచనలలో పడుతున్నాడు. కరోనా కొంత కను విప్పు కల్పించినప్పటికీ సేంద్రియ వైపు రైతు దృష్టిని కేంద్రీకరించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే ప్రపంచ ఆరోగ్య మిషన్ చెప్పిన విధంగా భారత ప్రజలు విషపూరిత అలవాట్లతో విషపూరిత ఆహారంతో రాబోవు 10 ఏళ్లలో 80% ప్రజలు క్యాన్సర్ బారిన పడతారని చెప్పిన మాట నిజమవుతుందేమోనని సేంద్రియ శాస్త్రజ్ఞులు భయపడుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఇటువైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు సామాజికవేత్తలు కోరుతున్నారు.

Latest News

మల్క కొమరయ్య ని ఆశీర్వదించండి..

పిలుపునిచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్.. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించిన మున్నూరు కాపు సంఘం.. ఉపాధ్యాయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్.. ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS