- పిలుపునిచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్..
- ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించిన మున్నూరు కాపు సంఘం..
- ఉపాధ్యాయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్..
ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరి వలన ఉపాధ్యాయుల సమస్యలు అలాగే ఉన్నాయి.. నిరంతరం ఉపాధ్యాయుల తరఫున పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ.. అలాంటి బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా బరిలో నిలబడిన మల్కా కొమరయ్య లాంటి నిబద్దత కలిగిన వ్యక్తిని గెలిపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి.. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యను ఆశీర్వదించి గెలిపించాలని, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు. రాష్ట్రంలోని రైతులను, ప్రజలను ఇబ్బందుల పాలు చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు ఎలాంటి న్యాయం చెయ్యలేదన్నారు. కాబట్టి బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య ను గెలిపించాలన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య
ఈ నెల 27 న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బిజెపి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య అన్నారు. నిజామాబాద్ లో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో అయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో డిఎస్సీ వేయలేదని,. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యలకు ఫీజు రీయంబర్స్‌మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నరన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తనకు వచ్చే ఎమ్మెల్సీ జీతాన్ని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెచ్చిస్తానన్నారు.. విజ్ఞులైన ఉపాధ్యాయులారా ఒక్కసారి ఆలోచించండి.. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదు.. ఈసారి కచ్చితంగా బిజెపి అభ్యర్థిగా పలు ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన నన్ను గెలిపించి మండలికి పంపితే.. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని.. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నదని.. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరంతరంగా పోరాటం చేస్తానని.. గత ప్రభుత్వాలు విద్యావ్యవస్థని మొత్తం బ్రష్టు పట్టించారని.. నిధులు లేక విద్యావ్యవస్థలో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉపాధ్యాయులారా మీరంతా మేధావులు.. ఈసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను మండలికి పంపిస్తే ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఉపాధ్యాయులను కోరడం జరిగింది..

ఈ కార్యక్రమంలో టి.పీ.యూ.ఎస్., బీ.సి.టి.యూ., టి.టి.యూ. తదితర సంఘాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది..