Monday, February 24, 2025
spot_img

ఉన్నతాధికారులను బురిడీ కొట్టిస్తున్న ఆ అధికారి.!

Must Read
  • రావుస్ ఫార్మా లేబరేటరీస్ పై చర్యలు శూన్యం.
  • నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న సంబంధిత శాఖ అధికారులు.
  • 38 గుంటల గాను, 153 చ,,గ లే అని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మండల అధికారి.
  • మామూళ్ల ముట్టాయని రిపోర్టు మార్చారా.?
  • ఐదు నెలలు గడిచిన ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు జాడ లేదు.

తనకున్న పవర్ తో ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు ఇస్తూ, జిల్లా అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా మండల అధికారి వ్యవహరిస్తున్న తీరుపై ఆదాబ్ హైదరాబాద్ లో ప్రత్యేక కథనం.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న చివ్వెంలలో, ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ కు సంబంధించిన భూమిని ఓ ఫార్మా కంపెనీ ఆక్రమణ విషయమై జిల్లా ఉన్నతాధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో ఫీల్ ఎంక్వయిరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా, మండల తహసిల్దార్ కృష్ణయ్య రావుస్ ఫార్మా లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనుకూలంగా ఉండేలా, తప్పుడు రిపోర్టు తయారుచేసి, జిల్లా ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించే విధంగా పంపారు. చివ్వెంల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 544 లో , ఎస్సారెస్పీ డీబిఎం కెనాల్ భూమిని అక్రమంగా ఆక్రమించుకునే కట్టడాలు జరిపినందున, తహసిల్దార్ కార్యాలయం నుండి 5 సెప్టెంబర్ 2024 న రావుస్ ఫార్మా లాబరేటరీస్ వారికి నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులో రావుస్ లేబరేటరీస్ ఫార్మా చివ్వెంల గారికి తెలియజేయునది ఏమనగా.! అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ నెంబర్ 4, చివ్వెంల మండలం మండల సర్వేయర్ నివేదిక ఆధారంగా,చివ్వెంల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 544లో, విస్తీర్ణం 153 చ,,గ ఎస్సారెస్పీ కెనాల్ భూమిని మీరు అక్రమంగా ఆక్రమించి, అక్రమ నిర్మాణం చేసి ఉన్నారని నివేదికలో పొద్దుపరిచారు. తదుపరి రావుస్ లేబరేటరీస్ ఫార్మా అట్టి అక్రమ నిర్మాణం (కట్టడాలు) మూడు రోజుల్లో కూల్చివేయాలని ఆదేశించనిది, లేనియెడల మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో అధికారులు పేర్కొన్నారు.

తప్పుడు రిపోర్ట్ తో తప్పుదోవ :
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు వారి వారి రిపోర్టులను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ,చివ్వెంల తహసిల్దార్ కృష్ణయ్య మాత్రం రావుస్ ఫార్మా లాబరేటరీస్ కు అనుకూలంగా ఉండే విధంగా రిపోర్టు తయారుచేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపడంపట్ల,స్థానికులు, గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రావుస్ ఫార్మా లేబరేటరీస్ సుమారు 38 గంటలకు పైగా భూమిని ఆక్రమించుకుందని, గత మూడు సంవత్సరాలుగా ఆదాబ్ లో ఎన్నో వార్తా కథనాలు వెలువడ్డాయి. వార్తా కథనాలకు అనుగుణంగానే అధికారులు విచారణ చేసి సర్వే చేసినప్పుడు 38 గంటలకు పైగా భూమినీ ఫార్మా కంపెనీ నిర్వాహకులు ఆక్రమించారని తేల్చారు. కానీ ఎం ఆర్ ఓ మాత్రం రావుస్ ఫార్మా నిర్వాహకులు కేవలం 153 చదరపు గజాలు మాత్రమే ఆక్రమించుకున్నారని,తప్పుడు రిపోర్ట్ తయారుచేసి, జిల్లా ఉన్నతాధికారులకు పంపడం పట్ల గ్రామస్తులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీ ఆక్రమించుకున్న 38 గుంటలు భూమిని, అధికారులకు పంపిన రిపోర్టులో రాయకుండా,కేవలం 153 చదరపు గజాలు ఆక్రమించుకున్నట్లు రాయడం ఏంటని, దీని వెనకాల ముడుపులు చేతులు మారాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

నోటీసులతో కాలయాపన, చర్యలు శూన్యం :
చివ్వెంల గ్రామ శివారులో ఉన్న రావుస్ ఫార్మా లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్సారెస్పీ కెనాల్ భూమిని ఆక్రమించుకున్న విషయంపై గత రెండు సంవత్సరాల నుండి గ్రామపంచాయతీ, ఇరిగేషన్, రెవిన్యూ శాఖల నుండి పలుమార్లు నోటీసులు ఇస్తున్నారే తప్ప ఎలాంటి కూల్చివేతలు జరపకుండా కాలయాపన చేస్తూ, నోటీసుల పేరుతో ముడుపులు అందుకుంటున్నారనే ఆరోపణలు చుట్టూరా ఉన్న ప్రజలలో బహిరంగం గానే వినిపిస్తున్నాయి. నిజంగానే అధికారులు ముడుపులు తీసుకుని కాలయాపన చేస్తున్నారా.? చర్యలు తీసుకునేందుకు ఎందుకు జంకుతున్నారనేది వారికే తెలియాలి.

రావుస్ ఫార్మా పై చర్యలు తీసుకోవాలి : ధరావత్ వెంకటేష్ సూర్యాపేట, శాంతినగర్.
ఎస్సారెస్పీ డిబిఎం కెనాల్ భూమిని ఆక్రమించి నిర్మాణం చేసిన, చివ్వెంల గ్రామ శివారులోని రావుస్ ఫార్మా లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పై అధికారులు శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని సూర్యాపేట శాంతినగర్ కు చెందిన ధరావత్ వెంకటేష్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం ఫార్మా నిర్వాహకులకు,కెనాల్ వెంట కట్టిన అక్రమ నిర్మాణం కూలుస్తామంటూ నోటీసులు ఇచ్చి, అధికారులు ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా గత ఐదు నెలలుగా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెంకటేష్ నాయక్ అన్నారు. రావుస్ ఫార్మా కంపెనీ పై అధికారులు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

Latest News

మల్క కొమరయ్య ని ఆశీర్వదించండి..

పిలుపునిచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్.. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించిన మున్నూరు కాపు సంఘం.. ఉపాధ్యాయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్.. ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS