యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. సీఎం దంపతులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ ఉన్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి రోజు స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు ఎండోమెంట్ కమిషనర్, ఆలయ ఈవో, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.










