గౌడ్స్ హాస్టల్ జనరల్ సెక్రెటరీ ప్రతాప్ లింగం గౌడ్
భవితరాల భవిషత్ కోసం పటాన్‌చెరువు మండలం నందిగామ గ్రామం వద్ద నిర్మిస్తున్నటువంటి కొత్త గౌడ్స్ హాస్టల్ బిల్డింగ్ పనులు 51,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో మా అధ్యక్షులు మోతె చక్రవర్తి గౌడ్ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. హాస్టల్ నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి దాతలకు మా కమిటీ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియచేస్తున్నాము. ఇప్పటివరకు ఐదు స్లాబులుపూర్తి అయి, మూడు ఫ్లోర్స్ బ్రిక్ వర్కుతో పాటు ప్లాస్టరింగ్ పనులు కూడ జరుగుతున్నాయి. బిల్డింగ్ పూర్తి కావటానికి దాదాపుగా పది కోట్ల రూపాయలు అవసరం ఉంన్నందున నాతోపాటు మా అధ్యక్షులు చక్రవర్తి గౌడ్, గౌడ్స్ హాస్టల్ అడ్విసెర్స్ మరియు మా కమిటీ సభ్యులు హాస్టల్ నిర్మాణంలో భాగస్వాములై ఎలాగైనా నిర్మాణం పూర్తిచేయాలనే ధృడ సంకల్పంతో రూమ్ కొరకై (5లక్షలు) డొనేట్ చేయటానికి ముందుకొస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. అంతే కాకుండా పేద విద్యార్థుల అభ్యున్నతి కోసమై గౌడ్స్ హాస్టల్ పూర్వ విద్యార్థులందరం కలిసి ఉప్పల్ భాగాయత్ లో నిర్మించినటువంటి హాస్టల్ కు 50లక్షలు ఆర్థిక సహాయం అందించినట్లు నందిగామ హాస్టల్ నిర్మాణానికి సహకరించటానికి ముందుకు వస్తున్నందుకు వారికీ కూడా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాము. గొప్ప సంకల్పంతో తన తల్లిదండ్రుల పేరున దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ అర ఎకరం భూమి డొనేట్ చేసి గౌడ కులానికి మార్గదరదర్శిగా నిలిచారు. దయచేసి గౌడబంధులందరు జాతి అభివృద్ధిని కాంక్షించి, హాస్టల్ నిర్మాణం పూర్తికావడానికి తమవంతు సహకారాన్ని విరాళాల రూపంలో అందించి హాస్టల్ నిర్మాణం పూర్తికావడానికి భాగస్వాములు అయి మన విద్యార్థులను ఆశిర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.