Friday, May 9, 2025
spot_img

మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వండి

Must Read
  • ఆర్‌ఐడీఫ్‌ కింద తక్కువ వడ్డీకి రుణాలు
  • నాబార్డ్‌ చైర్మన్‌ను కోరిన సిఎం రేవంత్‌

మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాబార్డ్‌ ఛైర్మన్‌ను కోరారు. కో-ఆపరేటివ్‌ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్‌ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో శుక్రవారం నాబార్డ్‌ చైర్మన్‌ షాజీ కేవీ భేటీ అయ్యారు. ఆర్‌ఐడీఫ్‌ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. స్వయంసహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని సీఎం కోరారు. ఐకేపీ, గోడౌన్స్‌, రైస్‌ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్‌ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి అడిగారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు స్కీమ్స్‌ నిధులు మార్చ్‌ 31వ తేదీలోగా ఉపయోగించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్‌ ప్లాంట్స్‌ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని సూచించారు. కొత్త గ్రామపంచాయతీలకు రూరల్‌ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి నాబార్డు చైర్మన్‌ ప్రతిపాదించారు. ఈ సమావేశంలో నాబార్డు ప్రతినిధులతో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS