Friday, July 4, 2025
spot_img

దంతెవాడలో కా*ల్పులు

Must Read
  • ఛత్తీస్‌గాడ్‌లోమరోమారు ఎన్‌కౌంటర్‌
  • మహిళా మావో రేణుక హతం
  • మృతురాలు వరంగల్‌ జిల్లా కడవెండి..
  • ఆమెపై రూ.25 లక్షల రివార్డు
  • దండకారణ్య స్పెషల్‌ జోన్‌లో కమిటీ సభ్యురాలు

సోమవారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. రిజర్వ్‌ గార్డ్‌ ఆధ్వర్యంలోని భద్రతా దళాల బృందం దంతెవాడ జిల్లాలో బీజాపూర్‌ సరిహద్దు గ్రామాలైన నెల్గోడ, అకేలి, బెల్నార్‌లోని భైరామ్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతాలలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టారు. మావోయిస్టులకు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కా*ల్పుల్లో రేణుక అలియాస్‌ బాను అనే మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఆమె రూ.25 లక్షల రివార్డు ఉన్న దండకారణ్య స్పెషల్‌ కమిటీకి చెందిన వారిగా భద్రతా దళాలు గుర్తించాయి. ఘటనాస్థలి నుంచి మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు ఇన్సాస్‌ రైఫిల్‌, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్‌ కొనసాగుతోంది. దంతేవాడ, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది యాంటీ-నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి చెందింది. మృతి చెందిన మావోయిస్టు వరంగల్‌కు చెందిన రేణుక అలియాస్‌ ఛైతి అలియాస్‌ సరస్వతిగా గుర్తించారు. ఈమె మావోయిస్టు స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలని.. దండకారణ్య స్పెషల్‌ జోన్‌లో కమిటీ సభ్యురాలిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమె తలపై రూ.25లక్షలు ఉన్నట్లు వెల్ల‌డించారు.. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో భారీగా తుపాకులు, పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమె ప్రముఖ నక్సలైట్‌ శాఖమూరి అప్పారవు భార్య రేణుకగా గుర్తించారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS