ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తున్న ఒక ప్రైవేటు- హెలికాప్టర్ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో హెలీకాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఆరుగురు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.