Sunday, July 13, 2025
spot_img

గుజరాత్‌ ఖావ్డా వద్ద డ్రోన్‌ పేలుడు

Must Read

అప్రమత్తం అయిన భద్రతా బలగాలు

ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ విరుకుచుపడిరది. ఈ దాడులతో ప్రస్తుతం భారత్ – పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలోని ఇండియా – పాకిస్తాన్‌ సరిహద్దు సమీపంలో అనుమానాస్పద పేలుడు సంభవించింది. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఖావ్డా ఇండియా బ్రిడ్జి సరిహద్దు ప్రాంతంలో గురువారం ఉదయం డ్రోన్‌ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, వైమానిక దళ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రోన్‌ సరిహద్దు అవతల నుంచి వచ్చిందా లేదా అనేది ఇంకా నిర్ధారించలేదు. అయితే అనుమానాస్పద డ్రోన్‌ హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ను ఢీకొట్టడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. డ్రోన్‌ పేలుడుకు, పాకిస్తాన్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భారత్‌ దాడులను జీర్ణించుకోలేని పాకిస్తాన్‌.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది. గురువారం కూడా కాల్పులను కొనసాగించింది. అయితే భారత ఆర్మీకి వారికి దీటుగా సమాధానం ఇస్తోంది. పాకిస్తాన్‌ తిరిగి దాడులు చేయనుందనే సమాచరంతో భారత్‌ అప్రమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. రాజస్థాన్‌, పంజాబ్ రాష్ట్రాల్లో ఇప్పటికే హై అలర్ట్‌ ప్రకటించింది. పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు చేయడంతో పాటూ సెలవులో ఉన్న అధికారులను వెంటనే విధుల్లో హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు- చేస్తున్నారు.

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS