Thursday, July 3, 2025
spot_img

రాంచందర్ రావు నేతృత్వంలో బీజేపీ

Must Read

తెలంగాణ బీజేపీకి కొత్త ఆశగా నిలిచిన పేరు – ఎన్. రాంచందర్ రావు.

ఆలోచనలతో నడిచే ఈ న్యాయవాది నాయకుడు, ఉద్యమ కాలం నుంచి పార్టీకి అంకితంగా పనిచేస్తూ స్వచ్ఛత, మితభాష, సుశీల రాజకీయాల ప్రాతినిధ్యంగా ఎదిగిన వ్యక్తిత్వం. తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ రాజకీయాల్లో ఆయా కాలాల్లో వచ్చిన ఒడిదుడుకులను పక్కదారి మళ్ళించి, పార్టీకి గౌరవాన్ని, నాయకత్వాన్ని, సామర్థ్యాన్ని కలిగించే బాధ్యత ప్రస్తుతం ఆయన భుజాలపై ఉంది.

రాంచందర్ రావు రాజకీయ జీవితానికి మూలం న్యాయవాదిగా ఉన్న సుదీర్ఘ అనుభవమే. హైకోర్టు అడ్వకేట్‌గా తన వృత్తిలో ప్రశంసలు అందుకుంటూనే, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. బహుళ విభాగాల సమస్యలపై లోతుగా అవగాహన ఉన్న ఆయనకు ప్రజల సమస్యలపై స్పందించే తీరు ప్రత్యేకత. ఓనాటి ఉద్యమం లోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నపుడూ బలమైన వాదనలతో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయన వాక్చాతుర్యంతో, సూత్రబద్ధమైన నడవడికతో బీజేపీ గొప్ప ప్రతినిధిగా నిలిచారు.

రాంచందర్ రావులోని ప్రధాన బలమేది అంటే – అంతర్గత కలహాలను ప్రశాంతంగా ఎదుర్కొని, వర్గ పోరాటాలను దరి చేరకుండా వహరించగల నైపుణ్యం. ఆయనకు పార్టీలో అనేక వర్గాల్లోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. క్రమశిక్షణ, కార్యకర్తల పట్ల గౌరవం, భావోద్వేగాలకు లొంగకుండా వ్యవహరించగల నిబద్ధత వంటి లక్షణాలు ఆయన నాయకత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడు తున్నాయి.

పార్టీలోకి వచ్చిన నూతన నేతలతో పాటు పాత క్యాడర్‌ను సమన్వయపరిచే లోక నాయకత్వ ధోరణి ఆయనది. ఒక్కసారిగా ఉత్తరాధికారాన్ని సొంతం చేసుకోవాలన్న ఆతురత ఆయనలో కనిపించదు. బదులుగా, నిశ్చింతగా, నిర్లక్ష్యంగా కాకుండా సమగ్ర వ్యూహంతో పార్టీని ముందుకు నడిపించే శక్తి ఆయనకు ఉంది. కార్యకర్తల మూడ్, వర్గీయ పరస్పర అభిప్రాయ భేదాల నేపథ్యంలో కలుపుగోరుగా వ్యవహరించే నేతగా ఆయనపై ఆంతర్గతంగా విశ్వాసం పెరుగుతోంది.

రాంచందర్ రావు బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లగల నాయకుడు. ఆయన మాటల్లో ప్రత్యేక ధ్వని, ప్రజల పట్ల గౌరవ భావం, అధిపత్య భావన లేకుండా వ్యవహరించే మానవతా శైలి – ఇవన్నీ సమకాలీన రాజకీయాల్లో అరుదైన విలువలు. ఆయన వ్యక్తిత్వంలో రాజకీయ ప్రతిభతో పాటు సాంస్కృతిక అభిరుచి, సామాజిక స్పృహ, చట్టాలపై లోతైన అవగాహన కనిపిస్తుంది.

తెలంగాణ బీజేపీకి ప్రస్తుతం ఉన్న అనేక సమస్యలు – వర్గీయ పోరు, అసంతృప్తులు, కమ్యూనికేషన్ లోపం, ప్రజల్లో నమ్మక బలహీనత వంటి వాటిని అధిగమించాలంటే ఒక మిశ్రమ నేత అవసరం. బహుళ విభాగాలపై పట్టు ఉన్నవాడు కావాలి. ప్రజల్లో విశ్వసనీయత కలిగినవాడు కావాలి. పార్టీ కార్యచరణను నిర్వాహకంగా పటిష్టంగా మలచ గలవాడు కావాలి. ఆ మూడింటి కలయిక రాంచందర్ రావులో ఉంది.

ఆయన పార్టీకి పరిమితమైన నేత మాత్రమే కాదు. నైతిక విలువలతో కూడిన ప్రజా ప్రతినిధిగా, కార్యకర్తలకు మార్గదర్శిగా, సమర్థ శక్తిగా మారగల నాయక శక్తి ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ లబ్దులకోసం కాదు, పార్టీ పునర్నిర్మాణం కోసం ఆత్మార్పణ పూరితంగా పనిచేయగల తీరు ఆయనకి ప్రత్యేకమైన స్థానం కల్పిస్తుంది.

ఈ సమయంలో బీజేపీకి కావాల్సినది రాద్దాంత శబ్దాలు చేసే నేతలు కాదు. శబ్దాన్ని కార్యాచరణగా మార్చగల సుదీర్ఘ దృక్కోణం కలిగిన నాయకత్వం. అలాంటి నాయకుడే రాంచందర్ రావు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి తిరిగి ప్రతిష్ఠను తీసుకు రావాలంటే, ఆయన వంటి నాయకుల నైతిక బలమే దారి దీపం కావాలి.

రాష్ట్రీయ రాజకీయాలు తిరుగుబాటులో ఉన్న ఈ వేళ, రాంచందర్ రావు నాయకత్వంలో బీజేపీ తన లోతును గుర్తించుకుని మళ్లీ సమర్థ రాజకీయ శక్తిగా మారే అవకాశం ఉంది. ఇది ఒక నాయకుడి మీదే కాదు, పార్టీ వ్యూహం మీద, సహచరుల సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ యాత్రకు మార్గ నిర్దేశకుడిగా రాంచందర్ రావు తగిన నాయకుడని చెప్పడంలో సందేహం లేదు.

రామ కిష్టయ్య సంగన భట్ల,
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్టు, కాలమిస్టు… 9440595494

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS