Friday, July 18, 2025
spot_img

స్థానిక ఎన్నికల్లో వడ్డెరలకు ప్రాధాన్యత కల్పించాలి

Must Read
  • జులై 25 నుంచి వడ్డెరల రాష్ట్ర వ్యాప్త పర్యటనలు
  • జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులుగా పీట్ల శ్రీధర్ ఎన్నిక

స్థానిక సంస్థల ఎన్నికలలో వడ్డెర కులస్తులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని జాతీయ వడ్డెర సంఘం నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం బషీర్ బాగ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులుగా ఫీట్ల శ్రీధర్ ను ఎన్నుకున్నారు. అదేవిధంగా వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా వల్లపు శివ, యువజన సంఘం జాతీయ అధ్యక్షులుగా వేముల భరత్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారికి వడ్డెర సంఘం నేతలు కుంచాల ఏడుకొండలు లోకనాథం భక్తుల లక్ష్మీకాంతయ్య వల్లపు మొగిలి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ తదితరులు పాల్గొని వారికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన వారిని ఘనంగా సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ, రాజకీయ సామాజిక పరంగా వెనుకబడిన వడ్డెర కులస్తులను చైతన్య పరిచేందుకు నూతన రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేపట్టనున్నట్లు తెలిపారు. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజకీయ ప్రాధాన్యత చట్టసభల్లో వడ్డెర్ల గురించి మాట్లాడే గొంతు లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు. పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి టు కాశ్మీర్ పాదయాత్ర చేస్తూ సామాజిక న్యాయం ద్వారా కులాల యొక్క అభివృద్ధి జరుగుతుంది అని వారు గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడ్డర్లకు ప్రాధాన్యత కల్పిస్తారని, పూర్తిస్థాయిలో జాతీయ వడ్డెర సంఘం నమ్ముతుందన్నారు. విద్యాపరంగా వెనుకబడిన వడ్డెర విద్యార్థులకు దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాల్లో సీట్లు కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పీట్ల గోపాల్, డేరంగుల నరసింహ, ఎత్తరి గురు రాజ్, శివరాత్రి ఎల్లయ్య, పల్లం రమేష్, దండువుల శేఖర్, వెంకటస్వామి, వల్లపు గణేష్, కొమ్మరాజుల శేఖర్, వల్లపు చంద్రశేఖర్, ఆలకుంట్ల శేఖర్, దండుగుల స్వామి, తాండూర్ రాములు, గండికోట యాదయ్య, ఒంటి పులి నాగరాజు, గుంజ శ్రీనివాస్, శివరాత్రి వెంకన్న, గిరీష్ కుమార్, కొమర శ్రీనివాస్, సంపంగి శంకర్, పీట్ల వేణుగోపాల్, రామచంద్ర, బోదాస్ రవి తదితరులు పాల్గొన్నారు.

Latest News

కాళేశ్వరం మూడేళ్లకే కూలడం నిర్లక్ష్యం

పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టిన ఘనుడు అక్కున చేర్చుకుని ఎంపిగా గెలిపిస్తే మోసం చేసిండు కెసిఆర్‌ మోసపూరిత విధానాల వల్లనే పాలమూరు వెనకబాటు శ్రీశైలం నిర్వాసితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS