- దుబాయ్‌లో కేదార్‌నాథ్‌తో ఉన్న సంబంధం ఏమిటో
- నీటి పంపకాలపై చర్చ జరిగితే ఎందుకీ విమర్శలు
- కేటీఆర్ తీరుపై మండిపడ్డ ఎంపి చామల
సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బకు కుదేలై మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి మరింత దోచుకుంటామని కలలుగన్న కేసీఆర్ కుటుంబం ఆలోచనలను ప్రజలు ముందే గ్రహించి.. వారిని ఇంటికి పంపారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చామల మాట్లాడారు. కేదార్ అనే వ్యక్తి దుబాయ్‌లో డ్రగ్స్ కారణంగా చనిపోయినట్లు తేలింది. ఆయనకు కేటీఆర్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దుబాయ్‌లో కేదార్‌తో పెట్టుబడులు పెట్టించిందెవరు? సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేముందని అన్నారు. గతంలో పదేళ్లు చర్చ లేకుండా అసెంబ్లీ నడిపారు. గతంలో జీవోలపై మంత్రులకే తెలియకుండా చేశారు. ఇప్పుడు రచ్చ, చర్చ అని ఆరోపణలు చేస్తున్నారు.
కేంద్ర జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల సీఎంలను ఢిల్లీకి పిలిపించింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై నెలకొన్న సమస్యలపై చర్చించేందుకే వారిని రప్పించినట్లు ప్రెస్‌నోట్ కూడా విడుదల చేసింది. దానిని పక్కన పెట్టి బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చించారంటూ బీఆర్‌ఎస్ నేతలు ప్రెస్‌మీట్‌లు పెట్టి ఊదరగొట్టారు. ఇలా చేయడం సరికాదని చామల పేర్కొన్నారు. ఈ మేరుకు దుష్పచ్రారం చేయడాన్ని కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
పదేండ్లు అబద్దాలు ఆడిన శిశు పాలుడు పామ్ హౌస్ లో పడుకుండు.. కేటీఆర్ రెండు వేసుకొని ఖమ్మం పోయినట్లు ఉండు అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా ఐదేండ్లు పూర్తి కావాలని కేటీఆర్ తహతహాలాడుతుండని , రేవంత్ రెడ్డి లీకు వీరుడా.. గ్రీకు వీరుడా.. అనేది ఫామ్ హౌస్ కు పోయి మీ నాయనను అడుగు చెప్తడు అని ఆయన వ్యాఖ్యానించారు. వైట్ ఛాలెంజ్ చేసి వెంట్రుకలు, కిడ్నీ, లివర్ ఇస్తా అని ఇచ్చి ఉంటే ఈ డౌట్ వచ్చేది కాదని, కేదార్ తో హైలైట్ పబ్ పెట్టించింది ఎవరు అని అన్నారు.