Saturday, August 2, 2025
spot_img

దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి

Must Read
  • సామాజిక న్యాయం కాంగ్రెస్‌కే సాధ్యం
  • దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్‌
  • పదవులను త్యాగం చేసిన ఘనత సోనియాది
  • రాహుల్‌ను ప్రధానిని చేస్తామని తెలంగాణ పక్షాన హామీ
  • 75 ఏళ్ల నిబంధన పెట్టినా పదవి వదలని నేత మోడీ
  • మోడీని గద్దెదించడం కేవలం రాహుల్‌కు మాత్రమే సాధ్యం
  • కాంగ్రెస్‌ న్యాయ సదస్సులో సిఎం రేవంత్‌ రెడ్డి

దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పార్టీ కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యమని అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ వార్షిక న్యాయ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని.. భాజపా, భారత రాష్ట్ర సమితి, జేడీ, బీజేడీ, ఆర్‌జేడీ.. ఏ పార్టీ అయినా స్వాతంత్య్రం తర్వాతే వచ్చాయని తెలిపారు. ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కుర్చీలో, ఓడితే ఇంట్లో కూర్చుంటాయి. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా ప్రజల మధ్యే ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అన్నారు.

మోదీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించ ట్లేదని అన్నారు. వక్రమార్గంలో ఉన్న నేతలను రెండు చెంపదెబ్బలు కొట్టయినా దారిలోకి తెచ్చేందకు కాంగ్రెస్‌ కృషి చేస్తోంది. మా పార్టీ దేశానికి ఏం చేసిందని విమర్శిస్తున్నారు. 140 ఏళ్ల క్రితం దేశ ప్రజల స్వాతంత్య్రం కోసం కదం తొక్కింది. ఆంగ్లేయులను ఓడించింది. భారత్‌ నుంచి ఉగ్రవాదులను పారద్రోలేందుకు ఇందిరాగాంధీ కృషి చేశారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ అమరులయ్యారు. యూపీఏ-1 సమయంలో సోనియాగాంధీ ప్రధాని కావాలని అందరూ కోరారు. కానీ, ప్రధాని పదవిని ఆమె త్యాగం చేశారు. 2004లోనే రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రి అయ్యేవారు. ఆయన కోరుకుంటే 2009లోనే ప్రధాని అయ్యేవారు. కానీ ప్రధాని, కేంద్ర మంత్రి పదవులు పార్టీ సీనియర్‌ నేతలకు ఇచ్చారు. కార్యకర్తగానే ప్రజల కోసం రాహుల్‌గాంధీ పనిచేశారు. సామాజిక న్యాయం కోసం 25 ఏళ్లుగా పోరాడుతున్నారు.

మరోవైపు నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా కుర్చీ వదలట్లేదు. 2001లో సీఎం అయిననప్పటి నుంచి ఆయన కుర్చీలోనే ఉన్నారు. భాజపా సంఘ్‌ పరివార్‌ మోదీని తప్పించేందుకు ప్రయత్నించింది. కానీ అందుకు ఆయన రాజీ పడలేదు. 75 ఏళ్లు దాటిన వ్యక్తులు కుర్చీ వీడాలని మోహన్‌ భగవత్‌ చెప్పారు. కానీ 75 ఏళ్లు దాటినా.. మోదీ అందుకు సిద్ధంగా లేరు. ఇదే నిబంధనతో అడ్వాణీ, మనోహర్‌ జోషిని తప్పించారు. మోదీని సీఎం పదవి నుంచి తప్పించేందుకు గతంలో వాజ్‌పేయీ, ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు మోహన్‌ భాగవత్‌ ప్రయత్నించారు. ఆయన్ను తప్పించడం వారి వల్ల కాలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ పోరాటం విజయవంతం కాబోతుందని అన్నారు. దేశంలో సామాజిక న్యాయం, దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని, రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, 11 ఏళ్లుగా సామాజిక న్యాయం కోసం ఆలోచించడంలేదని, దేశానికి మార్గదర్శనం కోసం మనుసింఫ్వీు నేతృత్వంలో సదస్సు నిర్వహించడం గొప్పవిషయమన్నారు. సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ చేస్తున్నామన్నారు.

తెలంగాణ ప్రజల పక్షాన చెబుతున్నా.. రాహుల్‌ గాంధీని భారత ప్రధానిని చేసి తీరుతామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. గతంలో దేశానికి ప్రధాని అయ్యే ఛాన్స్‌ వచ్చిన రాహుల్‌ గాంధీ వదులుకున్నారని.. కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుంది రాహుల్‌ గాంధీ దేశ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. మోడీని ప్రధాని గద్దె మీద నుంచి కిందకు దించడం ఒక్క రాహుల్‌ గాంధీకే సాధ్యమన్నారు. మోడీని తరిమికొట్టి భారత రాజ్యాంగాన్ని రక్షిస్తామని పేర్కొన్నారు. మోడీని ఓడిస్తాం.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామన్నారు. మాది ఎప్పటికీ ప్రజల పక్షమేనన్నారు. పాకిస్థాన్‌ ను ఇందిరా గాంధీ రెండు ముక్కలు చేశారు. తీవ్రవాదంపై పోరాటం చేసి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తులు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు.

Latest News

వైశ్య వ్యాపార వేత్తల ఐక్యతకు కొత్త వేదిక – జీవీబీఎల్ ఘనంగా లోగో, వెబ్‌సైట్ ఆవిష్కరణ… ఏడు నూతన చాప్టర్ల ప్రకటన

వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్‌వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్‌లోని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS