పూజా కార్యక్రమాలు చేపట్టినట్లు సమాచారం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో చండీ యాగం రేపటి నుంచి ప్రారంభం కానుందని ప్రచారం సాగుతోంది. ఈ యాగాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యాగం కోసం సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారని చెబుతున్నారు. ఈ పూజా కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ చండీ యాగం మూడు రోజుల పాటు కొనసాగనుంది. మంగళవారం నుంచి అధికారికంగా యాగం ప్రారంభమవుతుందని అంటున్నారు.
ఒకవైపు యాగం ఏర్పాట్లు జరుగుతుండగానే, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు సమాచారం. యాగంతో పాటు రాజకీయపరమైన కీలక చర్చలు కూడా ఫామ్‌హౌస్‌లో కొనసాగాయిన, ప్రధానంగా కాళేశ్వరంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారని తెలుస్తోంది.