Wednesday, November 5, 2025
spot_img

కేవలం బిసిలకే 42శాతం రిజర్వేషన్లు

Must Read
  • 10శాతం ముస్లిం రిజర్వేషన్లను అంగీకరించం
  • తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచందర్‌రావు

కేవలం బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే బీజేపీ పూర్తి మద్దతిస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. ఇందులో ముస్లిం రిజర్వేషన్లను అంగీకరించబోమని అన్నారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దిల్లీలో కాంగ్రెస్‌ ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో చేసినట్లే దిల్లీకి వెళ్లి నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు ముస్లింలకు 10శాతం ఇస్తామని చెప్పలేదు. బీసీలకే 42 శాతం అమలు చేస్తామంటే పూర్తి మద్దతిస్తాం. ముస్లింలకు 10 శాతం ఇస్తే.. 10 శాతం బీసీలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లను భాజపా అడ్డుకుంటోందని ప్రచారం చేస్తోన్న కాంగ్రెస్‌ను బీసీలు నమ్మరని అన్నారు. బిసిల పేరు చెప్పి ముస్లింలకు ఇచ్చే కుట్రలను అడ్డుకుంటామని అన్నారు. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ఉద్దేశం లేదని రామచందర్‌రావు అన్నారు. ముస్లింలకు 10 శాతం ఇస్తే, పదిశాతం బిసిలకు అన్యాయం జరుగుతుందని ఆవేదనను వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే పాత రిజర్వేషన్లే కొనసాగించాలనేది ఉద్దేశం అని రామచందర్‌ రావు పేర్కొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This