Wednesday, August 20, 2025
spot_img

మద్యం షాపుగా మారిన జిల్లా రవాణా శాఖ కార్యాలయం..

Must Read

మద్యం సేవిస్తూ బాటిల్ పక్కన బెట్టుకుని డ్యూటీ..!
మహబూబాబాద్ జిల్లా రవాణా కార్యాలయంలో ఉద్యోగి నిర్వాకం!
మంత్రి పొన్నం ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకొని ఉద్యోగులు..!


పనిచేసే కార్యాలయం దేవాలయం.. విధినిర్వహణ దైవ సేవలాంటిదని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవరించవద్దని పలు సందర్భాల్లో తన శాఖ ఉద్యోగులకు అధికారులకు మంత్రి సూచించేవారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ ఉద్యోగుల తీరు మారట్లేదు…మద్యం సేవించి విధులకు రావడమే కాదు..! ఏకంగా కార్యాలయంలో మద్యం సేవిస్తూనే విధులు నిర్వహిస్తున్నారు… మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఓ ఉద్యోగి బీర్ తాగుతూ బాటిల్ ను పక్కనబెట్టుకుని డ్యూటీ చేస్తున్న వైనాన్ని ఒక వ్యక్తి తన ఫోన్ లో వీడియో తీసాడు. ఇప్పుడది వైరల్ గా మారడంతో జిల్లా రవాణా శాఖ అధికారులు సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం అవుతోంది… మంత్రి పొన్నం ఎంత చెప్పినా వినకుండా ఉద్యోగులు ఇలా వ్యవహరిస్తున్నారని, విధి నిర్వహణలో కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు…

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS