Wednesday, July 30, 2025
spot_img

త్వరలో మార్కెట్ లోకి హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌ వెహికిల్స్

Must Read

ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ఆఖరి వచ్చే ఏడాది జనవరి-మార్చి వరకు 4 ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాడళ్లను మార్కెట్ లోకి విడుదల చేసే ఆలోచనలో హ్యూందాయి మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) ఉంది.మార్కెట్ రెగ్యులేటర్ సెబికి దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ పేపర్స్ లో ఆ విషయాన్ని వెల్లడించింది.ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది.పర్యావరణ సమస్యలు,పెట్రోల్ ధరలను దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు సైతం ఎలక్ట్రానిక్ వెహికిల్స్ కొనడానికే మొగ్గు చూపుతున్నారు.దీంతో క్రెటా సహ మరికొన్ని ఈవీ వెహికిల్ మాడల్స్ ను అందుబాటులోకి తీసుకొనిరావాలని హెచ్‌ఎంఐఎల్‌ నిర్ణయించింది.ప్రస్తుతం అయోనిక్‌5,కోనా ఎలక్ట్రిక్‌ కార్లను హెచ్ఎంఐఎల్ విక్రయిస్తుంది.నూతనంగా ప్రవేశ పెడుతున్న ఎలెక్ట్రిక్ వెహికిల్స్ ధరలను సంస్థ ఇంకా ప్రకటించలేదు.ఇదిలా ఉంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ల నిర్మాణంపైన కూడా హ్యూండాయి మోటార్ ఇండియా సంస్థ ఆసక్తి చూపిస్తుంది.ప్రస్తుతం ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 11 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి.

Latest News

T-Hubలో శిరీష పోడిశెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

హైదరాబాద్, బీరంగూడకు చెందిన గృహిణి శిరీష పోడిశెట్టి, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS