Sunday, September 7, 2025
spot_img

ప్రభుత్వ భూమి కబ్జా భగ్నం

Must Read
  • అధికారులకిచ్చిన వినతులు బేఖాతర్
  • గ్రామ ప్రజల ఎంట్రీతో సీన్ రివ‌ర్స్‌
  • తోక‌ముడిచిన క‌బ్జాదారులు

పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసమని గతంలో మంత్రులు, ఇప్పటి ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్థానిక ఎంపీపీ, జెడ్పిటీసీ కాలే శ్రీకాంత్, గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఓ పండుగ వాతావరణంగా శిలాఫలకం వేసి ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల జాగాకు కేటాయించిన ఎకరా మూడు గుంటల ప్రభుత్వ భూమిని ఓ ప్రయివేట్ వెంచర్ కు పార్కు పేరిట కబ్జా చేసేందుకు విఫలయత్నం చేసారు. బడాబాబులు ఉండే సురభి వెంచర్ కు ఆనుకునే ఉన్న ఈ ప్రభుత్వ భూమిని పేదలకు ద‌క్క‌నీయొద్దు అనుకున్నారో ఏమో.. ఈ ప్రభుత్వ భూమిపై కన్ను పడింది. ఇంకేముంది సదరు కబ్జా దారులు కాలనీ పార్కు పేరిట కబ్జా చేసేందుకు ఇట్టి ప్రభుత్వ జాగాలో డబుల్ బెడ్ రూమ్ శిలా ఫలకం సాక్షిగా కాలనీ పార్కు పేరిట పెద్ద పెద్ద చెట్లను తెచ్చి నాటడం జ‌రిగింది. కాగా ఇదే విషయమై ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూడాలని గ్రామస్తులు పలుమార్లు సంబంధిత రెవిన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాలు సమర్పించడం జరిగిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అగ్రహించిన చిలుకూరు గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు చివ‌రికి అట్టి ప్రభుత్వ జాగాలో నాటిన పెద్ద పెద్ద చెట్లను పీకి పారేశారు.దీంతో కబ్జా రాయుల్లు వాగ్వాదానికి దిగినప్పటికీ గ్రామస్తుల ఆగ్రహం, సంఖ్యా బలం ముందు నిలబడలేక అక్కడినుంచి చిన్నగా జారుకున్నారు. దీంతో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని ప్రజలే కాపాడినట్లయిందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఏదయితేనేం.. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు గోడమీద పిల్లుల వలె జాప్యం చేస్తే ప్రజలు అలా చూస్తూ ఊరుకోరనీ, పేద ప్రజలకు అన్యాయం చేసే వారు ఎంతటి వారైనా తోక ముడవక తప్పదని ఈ విషయంతో మరోసారి రుజువు చేసిందనడంలో సందేహం లేదంటూ చర్చించుకుంటున్నారు మండల ప్రజలు. ఇంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్ గానీ, సంబంధిత రెవిన్యూ అధికారులు అన్యాక్రాంతమైతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రభుత్వ జాగాకు వెంటనే ఫిన్సింగ్ వేసి కాపాడే బాధ్యత తీసుకుంటారో లేదో వేచి చూద్దాం..

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This