Tuesday, August 19, 2025
spot_img

హోటల్స్,రెస్టారెంట్లకు కీలక ఆదేశాలిచ్చిన యూపీ సర్కార్

Must Read

ఉత్తర్‎ప్రదేశ్ సర్కార్ హోటళ్లు, రెస్టారెంట్లకు కీలక ఆదేశాలు జారీచేసింది. హోటల్స్, రెస్టారెంట్లలో పని చేసే వెటర్లు, చెఫ్‎లు మాస్కులు, చేతులకు గ్లౌస్ ధరించాలని, వంట చేసే ఆహారశాలలో సీసీటీవి ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇటీవల సహారన్‎పూర్‎లోని ఒక హోటల్ లో రొటీలు తయారుచేస్తున్న ఓ చెఫ్, ఆ రొటీల పై ఉమ్మివేస్తునట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అయింది. మరోవైపు ఘాజీయాబాద్ లో సైతం ఓ జ్యూస్ సెంటర్ నిర్వాహకుడు జ్యూస్‎లో మూత్రం కలిపినట్టు మరో వీడియో వైరల్ అయింది . దీంతో సీఎం యోగి ఇలాంటి ఘటనల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ప్రవర్తనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోటల్స్, రెస్టారెంట్స్‎ను నిరంతరం పరిశీలించాలని అధికారులను సూచించారు.

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS