Monday, August 18, 2025
spot_img

డిఆర్ఎస్ స్కూల్‌ని సందర్శించిన ‘భూల్ భూలయ్యా 3’ చిత్ర బృందం

Must Read

ప్రముఖ సినీతార కార్తీక్ ఆర్యన్ నటించిన చిత్రం భూల్ భూలయ్యా 3 ప్రమోషన్‌లలో భాగంగా శుక్రవారం డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌ని సందర్శించారు. ఈ నేపథ్యంలో స్కూల్ క్యాంపస్‌లో సినిమా తారలతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఎడిఫై వరల్డ్ స్కూల్ డైరెక్టర్ ఏ.కే.అగర్వాల్‌తో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులతో కలిసి కార్తీక్ ఆర్యన్ (రూహ్ బాబా క్యారెక్టర్‌ ) కు స్వాగతం పలికారు. స్కూల్‌ను సందర్శించిన సందర్భంగా డైరెక్టర్ ఏ.కే.అగర్వాల్‌తో కలిసి కార్తిక్ ఆర్యన్, విద్యాబాలన్‌లు ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం డైరెక్టర్లు సంజయ్ అగర్వాల్, గర్వ్ అగర్వాల్ ఏట్రియం ఆర్ట్ గ్యాలరీలో సందర్శనకు అతిథులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన శాస్త్రీయ, పాశ్చాత్య నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్‌లో సినీ నటీ నటులు సైతం డ్యాన్స్ స్టెప్స్‌ వేసి సందడి చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఎడిఫై వరల్డ్ స్కూల్ డైరెక్టర్ ఏకే అగర్వాల్ విద్యార్థులతో మాట్లాడుతూ, కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా భూల్ భూలయ్యా 3 ప్రమోషన్స్‌లో భాగంగా మా క్యాంపస్‌కు స్వాగతం పలకడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. ప్రత్యేక ప్లాంటేషన్ డ్రైవ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్లాష్ మాబ్‌లో మా విద్యార్థులు పాల్గొనడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. మా అత్యాధునిక సౌకర్యాలు విద్యార్థులకు సుసంపన్నమైన కళ, సంస్కృతిలో శిక్షణ పెంపొందించే వాతావరణాన్ని అందిస్తాయని వెల్లడించారు.

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS