Wednesday, July 2, 2025
spot_img

ఆశ్చర్యపోయేలా మాజీ ఎంపీ గోరంట్ల వ్యాఖ్యలు

Must Read
  • బాధితుల పేర్లను బయట పెట్టడం అత్యంత బాధాకరం
  • మహిళా కమిషన్‌ మాజీ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

అత్యాచారానికి గురైన బాధితుల పట్ల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని మహిళా కమిషన్‌ మాజీ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. మాధవ్‌ వ్యాఖ్యలపై విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబుని శనివారం కలిసి వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. అత్యాచార బాధితుల పట్ల గోరంట్ల మాధవ్‌ చేసిన వ్యాఖ్యలు అందరూ ఆశ్చర్యపోయేలా ఉన్నాయని అన్నారు. ఆ ఘటన జరిగినప్పుడు అత్యాచారాలకు గురైన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని అన్నారు. కానీ ఏ మాత్రం అవగాహన లేకుండా అత్యాచారానికి గురైన బాధితుల పేర్లను గోరంట్ల మాధవ్‌ నిస్సిగ్గుగా బయటకు చెప్పారని మండిపడ్డారు. ఆ ఘటనకు గురైన బాధితుల పేర్లు చెప్పి మాట్లాడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. మహిళల మీద, అత్యాచార బాధితుల పట్ల సోయిలేకుండా ఒక మాజీ ఎంపీ ఈ విధంగా మాట్లాడటం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఈ ఘటనకు గురైన బాధితుల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్ల మాధవ్‌ మీద చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ కోరారు. అలాంటి వారి మీద ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబుకు ఫిర్యాదు చేశానని తెలిపారు. గోరంట్ల మాధవ్‌ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ వైసీపీకి చెందిన కొన్ని చానల్స్‌ వార్తలు ప్రసారం చేయడం, ఇప్పటికీ తొలగించకపోవడం చూస్తే.. మహిళల పట్ల వైసీపీకి ఉన్న నిబద్దత ఏంటో అర్థం అవుతుందని వాసిరెడ్డి పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు మహేష్ చారి ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హయ్యర్ ఎడ్యుకేషన్ ముందు ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS