ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. మరణించిన 10 మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
ఒడిశా నుండి ఛత్తీస్గఢ్ సరిహద్దులోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో శుక్రవారం తెల్లవారుజామున భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. భద్రత బలగాలను గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రత బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ అనంతరం 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలంలో ఇన్సస్, ఏకే 47, ఎస్.ఎల్.ఆర్ తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.