Saturday, July 19, 2025
spot_img

పోలీసు విచారణకు హాజరైన అల్లుఅర్జున్‌

Must Read

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ మంగళవారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు పీఎస్‌కు చేరుకున్న బన్నిని తొక్కిసలాట ఘటన.. అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు విచారిస్తున్నారు. గంటన్నర్నకుపైగా విచారణ కొనసాగుతోంది. అడ్వొకేట్‌ అశోక్‌ రెడ్డి, ఏసీపీ రమేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌ సమక్షంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అల్లు అర్జున్‌ను విచారించారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్‌లో ఉన్నప్పుడు మీకు తెలియదా..? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు..? రోడ్‌ షోకు అనుమతి తీసుకున్నారా..? లేదా..? అనుమతి లేకుండా రోడ్‌ షో ఎలా నిర్వహించారు..? రోడ్‌ షోకు పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు..? వంటి ప్రశ్నలు అడిగారు. విచారణలో అల్లు అర్జున్‌ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. మొత్తం విచారణను వీడియో రికార్డింగ్‌ చేశారు. అయితే, పోలీసుల ప్రశ్నలకు బన్ని చెప్పే సమాధానాలు కీలకంగా మారనున్నాయి. మరోవైపు విచారణ అనంతరం అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్లే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. అక్కడ సీన్‌రీకన్‌స్ట్రక్షన్‌ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు థియేటర్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest News

కాళేశ్వరం మూడేళ్లకే కూలడం నిర్లక్ష్యం

పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టిన ఘనుడు అక్కున చేర్చుకుని ఎంపిగా గెలిపిస్తే మోసం చేసిండు కెసిఆర్‌ మోసపూరిత విధానాల వల్లనే పాలమూరు వెనకబాటు శ్రీశైలం నిర్వాసితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS