Saturday, July 5, 2025
spot_img

ముచ్చటగా బంధాలే సాంగ్ గ్రాండ్ గా లాంచ్

Must Read

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. తల్లీ కొడుకుల అనుబంధం సినిమా ప్రధానాంశం. ఈరోజు, చిత్తూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో సినిమా సెకండ్ సింగిల్- ముచ్చటగా బంధాలే సాంగ్ ని లాంచ్ చేశారు. స్టార్ కంపోజర్ బి అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ముచ్చటగా బంధాలే, కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకుల భావోద్వేగ అనుబంధంను సున్నితంగా చిత్రీకరించిన మేలోడిక్ మాస్టర్ పీస్. రఘు రామ్ సాహిత్యంతో కూడిన ఈ పాట తల్లి స్వభావాన్ని హైలైట్ చేస్తుంది, ఆమె తన కొడుకు విజయం సాధించాలనే కలలను సాకారం చేసుకుంటూ, అతనికి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అదే సమయంలో, కొడుకు తన తల్లిని సంతోషంగా, గర్వంగా ఉంచేందుకు ఎంతో ప్రయత్నిస్తాడు. తల్లి-కొడుకుల బంధంతో పాటు, ఈ పాట కళ్యాణ్ రామ్ ప్రేమ వైపు ఒక గ్లింప్స్ అందిస్తుంది, సాయి మంజ్రేకర్‌తో అతని సున్నితమైన రిలేషన్ ని పాటకు అదనపు ఎమోషన్ ని జోడిస్తుంది. హరిచరణ్ సోల్ ఫుల్ వాయిస్ ఈ పాట ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసింది,మొత్తంమీద, ముచ్చటగా బంధాలే తల్లి-కొడుకుల బంధానికి హృదయపూర్వక నివాళి. ఈ చిత్రానికి సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ప్రముఖ పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రామ్ ప్రసాద్, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సా. ఇప్పటికే హ్యుజ్ సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది.

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS