Wednesday, May 14, 2025
spot_img

ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ పొడిగింపు

వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ మరో 14 రోజులు పాటు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.గత వైసీపీ ప్రభుత్వ హయంలో మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం పై దాడి జరిగిన విషయం తెలిసిందే.ఈ కేసులో నందిగం సురేష్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వరద బాధితులకు ప్యాకేజీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సహాయం ప్రకటించింది.వరదల కారణంగా విజయవాడలో నష్టపోయిన ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా ప్యాకేజీ వివరాలను ప్రకటించారు.నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు అందించాలని తెలిపారు.మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు,ఇంట్లో వరద నీళ్ళు వచ్చిన బాధితులకు రూ.10 వేలు,మొదటి అంతస్తులో ఉన్నవారికి...

ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం

ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు,విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా,ఐపీఎస్ విశాల్ గున్ని పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.విచారణ పేరుతో ముంబై నటి కాదంబరి జేత్వానీని వేధించారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జగన్ ఐదేళ్ల పాలన ఏపీకి పెద్ద విపత్తు

మంత్రి నాదెండ్ల మనోహర్ వరద బాధితులను అదుకోవాలన్న ఆలోచన జగన్ కి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.శనివారం మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,జగన్ ఐదేళ్ల పాలన ఏపీకి పెద్ద విపత్తు అని ఆరోపించారు.అర్థం లేని విమర్శలతో వైసీపీ కాలక్షేపం చేస్తుందని వ్యాఖ్యనించారు.వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి

చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.శుక్రవారం బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం...

సుప్రీంకోర్టులో జోగి రమేష్,దేవినేనీ అవినాష్‎కు ఊరట

గత వైసీపీ ప్రభుత్వ హయంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేనీ అవినాష్,జోగి రమేష్ సహ ఐదు మంది వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఈ మేరకు వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.48 గంటల్లో పాస్‎పోర్టులను అప్పగించాలని ఆదేశించింది.అరెస్ట్ నుండి వారికి రక్షణ కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దర్యాప్తు అధికారులు ఎప్పుడు...

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం కేంద్ర అధికారుల బృందం పర్యటించింది.ఈ సంధర్బంగా ప్రకాశం బ్యారేజీని సందర్శించింది.బ్యారేజి నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రాంతాల్లో కూడా కేంద్ర అధికారుల పర్యటించింది.చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి,అరటి,కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది.

రెడ్ బుక్ మీ సొంతం కాదు,ప్రభుత్వం పై విరుచుకుపడ్డ జగన్

ఏపీ ప్రభుత్వం పై మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.బుధవారం గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‎ను పరామర్శించారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ,ప్రభుత్వం పై కీలక సంచలన ఆరోపణలు చేశారు.తమ పార్టీ నేతలను టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో వేదిస్తుందని మండిపడ్డారు.రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులను...

భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె గత పాలకులను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.తన వద్ద రెడ్ బుక్ ఉందని,దాంట్లో 100 మందికి పైగా పేర్లు ఉన్నాయని తెలిపారు.రెడ్‎బుక్ లో ఉన్న వారిని ఎవరిని కూడా వదిలిపెట్టాను అని హెచ్చరించారు.ఖచ్చితమైన ఆధారాలతో వారి పై చట్టపరమైన...

వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు.శుక్రవారం విజయవాడ పరిసరాల్లోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు.బుడమేరు డ్రైన్,కొల్లేరు ప్రాంతాల పరిశీలన చేపట్టారు.ప్రకాశం బ్యారేజి దిగువన కృష్ణా నది ప్రవాహాన్ని కూడా సీఎం చంద్రబాబు పరిశీలించారు.
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS