ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురిచేస్తుందని..రాజకీయంగా తనను వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. గతకొన్ని రోజుల నుండి తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక...
సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఐఏఎస్ అధికారిపై కేటీఆర్ చేసిన విమర్శలు పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా అధికారులు నిర్వర్తించే బాధ్యతలకు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొన్నారు. సిరిసిల్ల...
తెలంగాణలోని వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు కన్నబిడ్డలా చూసుకోవాలని తెలిపారు. అధికారులు పాఠశాలలు,వసతి గృహాలను తరచుగా తనిఖీ...
మాగనూర్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారించింది. సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తుందని తెలిపారు. వారం వ్యవధిలో భోజనం వికటిస్తే...
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. బుధవారం దిలావర్పూర్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం...
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి పరిశ్రమకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. బుధవారం స్థానిక మహిళాలు నిరసనలో పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు వెళ్ళగా, వారి వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వరు. పురుగుల మందు...
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం కేశవపట్నం మండలం తాడికల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్ల కొనుగోలుకు...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోతుంది. ఎక్కడ చూసిన ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. ఉత్తర, మధ్య తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో 15 డిగ్రీలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కంటే కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.అదిలాబాద్...
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ఆదానీ ఇస్తానన్న రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. గతకొన్ని రోజులుగా ఆదానీ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆదానీ వ్యవహారంపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు....
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. సోమవారం ఉదయం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేస్తున్న క్రమంలో బ్యాంకాక్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళాల వద్ద విష సర్పాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఇద్దరు మహిళాలను అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంకాక్ నుండి పాములు తీసుకొని వస్తున్న మహిళలను...