బీజేపీ నాయకులు జాకట ప్రేమ్ దాస్
మేడ్చల్ మున్సిపల్‌లోని మూడవ వార్డు లో ప్రతిరోజు ఉదయం పర్యటన చేసినపుడు పలు సమస్యలను స్థానికి ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాఘవేంద్ర కాలనీలో రోడ్లు మరియు డ్రైనే జీ సమస్యలు చాలా ఉన్నాయి అని జాకట ప్రేమ్ దాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 3వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉంది అని, రోడ్డు పైన మురికి నీరు పారుతుంది.. దాని వలన దుర్వాసన వస్తుంది, మురికి వల్ల చుట్టూ ప్రక్కల మా కుటుంబ సభ్యులకు తీవ్రమైన జ్వరాలు వస్తున్నా యి అని తెలిపారు. ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా బడ్జెట్ లేదని చెప్తున్నారు అని అంటున్నారు. ప్రజలకు కనీస సదుపాయాలు రోడ్డు, వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో మనము ఉన్నామా..? మన మేడ్చల్ మున్సిపల్ ఉందా.. దయచేసి మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి కాలనీ ప్రజల సమస్యలను తక్షణమే చర్యలు చేపట్టాలని తమరికి మనవి చేస్తున్నాను అని మేడ్చల్ బీజేపీ నాయకులు జాకట ప్రేమ్ దాస్ కోరారు.