నా తెలంగాణ.. కోటి రతనాల వీణ..!
అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ అదే ప్రేరణ.. తెలంగాణ స్ఫురణ..!
ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని..!
తీగలను దెంపి అగ్నిలోన దింపినావని..!
దాశరథి పలికించిన..”రుద్రవీణ”..నిప్పు కణకణ..!
డ్రాగన్నూ విడిచిపెట్టని దాశరథి కలం..!
ఖబడ్దార్ చైనా..అంటూ చేసింది హైరానా..!!
తిమిరంతో సమరం చేసిన కలం..!
ఉరకలెత్తిస్తే ధ్వజమెత్తిన ప్రజ..!
అంతటి నిజామూ గజగజ..!!
- సురేష్ బేతా