Saturday, February 22, 2025
spot_img

ఎన్నికల కోడ్‌ అంటే లెక్క లేదా..?

Must Read
  • సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో బహిరంగంగా సీఎం రేవంత్‌ రెడ్డి చిత్రపటం..!
  • ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘన..
  • సబ్‌ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు..

భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ నిర్వహించేటటువంటి ఎన్నికలు అంటే కొంతమంది ప్రభుత్వ అధికారులకి ఏమాత్రం లెక్క లేదు అనే వాదన వినిపిస్తుంది. అదే కోవలోకి కోదాడ సబ్‌ రిజిస్ట్రార్‌ అరవింద్‌ చెందుతాడు అనటంలో అతిశయోక్తి లేదు. ఇటీవల ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫి కేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాల యాల్లో, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలు, ఫోటోలు, జెండాలు, గోడ రాతలు లాంటివి కనిపించకుండా ఉండాలి. కానీ కోదాడ సబ్‌ రిజిస్ట్రార్‌ మాత్రం ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను భేఖాతరు చేస్తూ సిఎం రేవంత్‌ రెడ్డి చిత్రపటాన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దర్జాగా బహిరంగంగా ప్రదర్శిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ విధించిన ఎన్నికల కోడ్‌ అంటే కోదాడ సబ్‌ రిజిస్ట్రార్‌కు వర్తించదా లేకపొతే లెక్క లేదా అని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం పలు రకాల భూమి రిజిస్ట్రే షన్‌ల కోసం ఆఫీస్‌ కు వచ్చే ప్రజలకి సబ్‌ రిజిస్ట్రార్‌ గదిలోనే సిఎం రేవంత్‌రెడ్డి చిత్రపటం దర్శనమిస్తున్నా సంబంధిత ఎం.సి.సి (ఎన్నికల) అధికారులు పట్టించుకో కపోవడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ అధికార పార్టీకి వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం ప్రజల్లో వినిపిస్తున్నాయి. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ను ఉల్లంఘిస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల కోడ్‌పై అవగాహన కల్పించాల్సిన అధికారులే దారి తప్పితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయంమైన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని తొలగించకుండా ఉంచడంపై ప్రజల్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోదాడ సబ్‌ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలి.. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘించిన కోదాడ సబ్‌ రిజిస్ట్రార్‌ అరవింద్‌ పై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ నంద లాల్‌ పవార్‌ చర్యలు తీసుకోవాలని కోదాడ ప్రజలు కోరుతున్నారు.

Latest News

నాణ్య‌త‌లేని సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS